Advertisement
Google Ads BL

ఇండియన్ 2 సెట్స్ లో ప్రమాదం: ముగ్గురు దుర్మరణం!!


శంకర్ - కమల్ హాసన్ కాంబోలో భారతీయుడు సినిమానికి  సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా తెరకెక్కుతుంది. భారీ హంగులతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ చెన్నై అప్రైసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఇండియన్ 2 సినిమా షూటింగ్ సమయంలో... సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో క్రేయిన్ కూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, దర్శకుడు శంకర్ గాయపడడంతో పాటుగా మరో పదిమంది కి తీవ్రగాయాలైనట్టుగా వార్తలొస్తున్నాయి.

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ చెన్నై లోని ఈవీపీ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ లో చిత్రీకరణ జరుగుతుంది. అయితే షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో ఒక పెద్ద క్రేన్ ఒక్కసారిగా కిందపడటంతో ముగ్గురు వ్యక్తుల అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ మధు, చంద్రన్ మరో టెక్నిక‌ల్ అసిస్టెంట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దర్శకుడు శంకర్ కి కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మృతదేహాలను చెన్నై లోని రాజీవ్ గాంధి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంలో హీరో కమల్ హాసన్ కి గాయాలు అవలేదని, హీరోయిన్ కాజల్ కూడా క్షేమంగా ఉందని.. ఇక దర్శకుడు శంకర్ కి కూడా చిన్న చిన్న దెబ్బలే తగిలాయని చెబుతున్నారు.. ఈప్రమాదంతో కమల్ మాత్రమే కాకుండా అక్కడున్న వారంతా షాక్ కి గురైనట్లుగా ప్రత్యక్ష సాక్షుల కథనం.

Crane Accident On Indian 2 Sets:

Crane Accident On Indian 2 Sets: Three of the Assistant Directors Lost their lives
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs