Advertisement
Google Ads BL

12000 ఎకరాల్లో ఫైట్ చేసిన ‘నారప్ప’


వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి  రీమేక్‌ గా రూపొందుతున్న నారప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో  ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప’ కి సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ మాట్లాడుతూ - ‘‘తమిళనాడులోని రెడ్ డెసర్ట్ లో 10 రోజులు తీసిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి హైలెట్ అవుతుంది. వెంకటేష్ గారికి, నాకు ‘నారప్ప’ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది.’’ అన్నారు.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ- ‘‘నారప్ప మోస్ట్ పవర్ఫుల్, ఎమోషనల్ కేరక్టర్. ప్రేక్షకులు నారప్పగా కొత్త వెంకటేష్ గారిని చూస్తారు’’ అన్నారు.

కో- ప్రొడ్యూసర్ దేవి శ్రీదేవి సతీష్ మాట్లాడుతూ - ‘‘తమిళనాడులోని తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడులో నారప్ప యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాము. 12,000 ఎకరాల్లో ఉండే ఈ ప్రదేశాన్ని రెడ్ డెసర్ట్ ఆఫ్ తమిళనాడు అంటారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప’ కి సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేశాము’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ విజయ్‌ శంకర్‌ దొంకాడ మాట్లాడుతూ - ‘‘ఇప్పటికే  27 రోజులు షూటింగ్ పూర్తి చేశాం. ఇంకా నాన్ స్టాప్ గా షెడ్యూల్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు.

విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, కథ: వెట్రిమారన్‌, స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం, స్టిల్స్: నారాయణ, జి. శ్రీను, పబ్లిసిటీ డిజైనర్: రామ్ పెద్దిటి, ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి., ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్‌ పండి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్‌ దొంకాడ, కో- ప్రొడ్యూసర్‌: దేవిశ్రీదేవి సతీష్‌, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల

Victory Venkatesh Naarappa At 12000 Acre Therikaadu Red Desert:

Victory Venkatesh Naarappa Shooting Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs