Advertisement
Google Ads BL

అనంతపురంలో ‘నారప్ప’కి సినిమా కష్టాలు!


తమిళనాట ధనుష్ హీరోగా తెరకెక్కిస్తున్న అసురన్ సినిమా సూపర్ హిట్ అవడంతో నిర్మాత సురేష్ బాబు అసురన్ రీమేక్ రైట్స్ తన తమ్ముడు వెంకటేష్ కోసం కొనేసాడు. అనుకున్నదే తడవుగా అసురన్ గెటప్ లోకి వెంకీ మారిపోవడం శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా సినిమా పట్టాలెక్కడం జరిగిపోయింది. అసురన్ రీమేక్ టైటిల్ నారప్పలో వెంకటేష్ అచ్చం ధనుష్ లుక్ ని దించేసాడు. ఈ సినిమాలో ప్రియ‌మ‌ణి, అమ‌లాపాల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ అనంతపురం పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరుగుతుంది. అయితే అనంతపురం, తమిళనాడు ఇలా కొన్ని పల్లెటూళ్లలో ఈ సినిమాని షూటింగ్ చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే ప్రస్తుతం అనంతపురంలోని ఓ పల్లెటూరులో నారప్ప సాంగ్ షూటింగ్ జరుగుతుండగా అక్కడ షూటింగ్ చూడడానికి వెంకటేష్ అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో షూటింగ్ ని అర్ధాంతరంగా ఆపెయ్యాల్సి వచ్చిందట. అభిమానులు షూటింగ్ మాత్రమే చూడకుండా సెల్ ఫోన్స్ లో ఆ చిత్రీకరణ దృశ్యాలను చిత్రకరించడంతో నారప్ప టీం వర్రీ అవుతుందట. అయితే అనంతపురం పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేస్తే ఇలాంటి ఇబ్బంది తప్పదని తమిళనాడులోని ఓ పల్లెటూరికి నారప్ప షూటింగ్ షిఫ్ట్ చేశారట. త‌మిళ‌నాడులోని కోవిల్ ప‌ట్టి అనే గ్రామం. అనంత‌పురం నెటివిటీని పోలి ఉండడంతో నారప్ప టీం సాంగ్ షూట్ ని అక్కడ పెట్టుకున్నారట. మరి రాజమౌళి లాంటి పెద్ద దర్శకుడే RRR సినిమా షూటింగ్ విషయంలో అభిమానులతో పడలేకపోతున్నాడు. ఇప్పుడు తాజాగా వెంకీకి కూడా అదే సమస్య వచ్చింది.

Problam to Naarappa Movie Shooting in Ananthapuram:

Small Break to Naarappa Movie Shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs