Advertisement
Google Ads BL

నో చెప్పిన స్టార్ హీరో.. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్!?


అవును మీరు వింటున్నది నిజమే.. ఓ స్టార్ హీరో ఫలానా సినిమా చేయనని తేల్చిచెప్పడంతో.. అదే కథ చేయడానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంతకీ ఆ కథేంటబ్బా..? ఆ స్టార్ హీరో ఎవరు..? ఆ రేంజ్ కథ తయారు చేసిన డైరెక్టర్..? ఎవరనేగా మీ సందేహం.. ఇక ఆలస్యమెందుకు ఈ ఆర్టికల్ చదివేయండి మరి.

Advertisement
CJ Advs

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగా ఏ రేంజ్‌లో విజయాన్ని సొంతం చేసుకున్నాడో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే.. ఈ సినిమాను ఇతర భాషల్లో సైతం రీమేక్ చేసి సంచలనం సృష్టించాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి పిలుపువచ్చిందంటే అర్థం చేస్కోండి. అలా అక్కడ కూడా ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ‘కబీర్ సింగ్’ గా తెరకెక్కించి గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. 

‘కబీర్ సింగ్’ తర్వాత బాలీవుడ్‌లో పాగా వేయాలని భావించాడేమో గానీ.. మరో సినిమా చేయాలని.. కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆ కథకు బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణబీర్ కపూర్ అయితే సరిగ్గా సెట్ అవుతాడని భావించాడు. ఈ సినిమాకి ‘డెవిల్’ అనే టైటిల్ ఖరారు చేశాడు. అయితే లాస్ట్ మినిట్‌లో రణ్‌బీర్ హ్యాండిచ్చేశాడు. దీంతో ఏం చేయాలో డైరెక్టర్‌కు దిక్కుతోచలేదు. ఈ క్రమంలో ఎవరితో సినిమా తీస్తే సెట్ అవుతుందని ఆలోచించి.. ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చాడట.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అయితే అన్ని విధాలా కలిసొస్తుందని సందీప్ అనుకున్నాడట. హిందీ, తెలుగులో కూడా ప్రభాస్‌తోనే చేయాలని అనుకున్నాడట. ఈ క్రమంలో ప్రభాస్‌ను అడగ్గా.. అంత క్రేజ్, స్టార్ ఉన్న డైరెక్టర్‌ అడగటంతో ఒకట్రెండు సార్లు ఆలోచించిన డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ క్రమంలో స్టోరీ లైన్ కూడా వినిపించాడట. ఆ కథ నచ్చడంతో ‘నేను రెడీ డార్లింగ్’ అని సందీప్‌కు చెప్పేశాడట. అయితే ఇందులో వాస్తవమెంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది. నిజానిజాలు తెలియాలంటే ప్రభాస్ లేదా సందీప్ ప్రకటన చేయాల్సిందే మరి.

Prabhas Green Signal To Another Director Story!:

Prabhas Green Signal To Another Director Story!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs