Advertisement
Google Ads BL

జాను రిజల్ట్ చూశాక కూడా రీమేక్ ఏంటి నితిన్!


టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భీష్మ సినిమాతో  ఫిబ్రవరి ౨౧వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సారి భీష్మ సినిమాతో నితిన్ హిట్ కొట్టేలానే కనబడుతున్నాడు. విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో చిత్ర బృందానికి ఈ సినిమాపై నమ్మకం రోజు రోజుకీ పెరుగుతోంది. ఇదిలా ఉంటే నితిన్ తర్వాతి చిత్రం గురించి అనేక వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో విజయం సాధించిన అంధాధున్ చిత్రాన్ని నితిన్ రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Advertisement
CJ Advs

 

అయితే ప్రస్తుతం నితిన్ కూడా ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చేశాడు. ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడట. అయితే ఈ సినిమా రీమేక్ పై క్లారిటీ వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో నితిన్ కి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రీమేక్ సినిమాలంటే ఎవరూ ఆసక్తి చూపించట్లేదు. రీమేక్ చేస్తున్నారని తెలియగానే ఆ సినిమాని అదే భాషలో చూసేస్తున్నారు. అంతేకాదు రీమేక్ చేసిన చిత్రాలకి కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. జాను సినిమాతో ఈ విషయం క్లియర్ గా అర్థమైంది. తమిళంలో సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్లు వసూలు చేసిన 96 సినిమాని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేస్తే కనీస వసూళ్ళు కూడా రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి కారణం సినిమా బాగాలేకపోవడం కాదు. ఒరిజినల్ సినిమా గురించి అందరికీ తెలియడమే.. 

 

క్లాసిక్ గా నిలిచిన సినిమాలని రీమేక్ చేస్తే జనాలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో తెలిసిపోయింది. థ్రిల్లర్ జోనర్ లో అంధాధున్ కూడా ఒక క్లాసిక్ చిత్రమే. మరి ఈ సినిమాని రీమేక్ చేసి నష్టపోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో...!

Is necessary to do a movie at this time..?:

Nithin confirmed doing remake of Andhadhun in Telugu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs