రాజమౌళితో సినిమా అంటే హిట్టుకి హిట్టు, తలపోటుకి తలపోటు. ఒక్కసారి రాజమౌళి వలలోకి వెళ్లారంటే చేపల మాదిరి కొట్టుకోవాల్సిందే. అంటే రాజమౌళితో సినిమా వ్యవహారం మాటలు కాదు. తెలుగు భాషలోనే సినిమా అయితే రాజమౌళి చెప్పిన టైంకి సినిమా అందించేస్తాడు. పాన్ ఇండియా మూవీ అయితే రాజమౌళికే తెలియదు ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అయితే ఆ సినిమా వలన హీరోలకు ఫేమ్ అయితే వస్తుంది కానీ తమ విలువైన సమయాన్ని మాత్రం కోల్పోతారు. డబ్బుకి డబ్బు, క్రేజుకి క్రేజు వచ్చాక మిగతావన్నీ లెక్క కాదు కానీ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోలు మరీ రెండేళ్లు లాకవడం ఒప్పుకోలేకపోతున్నారు. ప్రభాస్ రెండేళ్ళని, ఐదేళ్లు ఇరుక్కున్నాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏడాదిన్నర అని రెండేళ్ళకి ఇరుక్కున్నారు.
రాజమౌళి చేసిన పనికి తమ నెక్స్ట్ సినిమా విషయంలో ఎన్టీఆర్, చరణ్ ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. RRR జూలై 30న విడుదలైతే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా ఈ ఏడాది మధ్యలో పట్టాలెక్కేది. కానీ జనవరికి RRR వెళ్లేసరికి ఇప్పుడు త్రివిక్రమ్ మరో హీరోకి కనెక్ట్ అయ్యేలా ఉన్నాడు. మరోపక్క ఎన్టీఆర్ తో చెయ్యడానికి నలుగురైదుగురు డైరెక్టర్స్ క్యూలో ఉన్నారు. ఎన్టీఆర్ ఎవరికీ ఓకే చెప్పలేని స్థితి. రామ్ చరణ్ పలు హిట్ సినిమాల రీమేక్ రైట్స్ కొంటున్నాడు. కానీ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇవ్వడం లేదు.
రాజమౌళి ఈ ఇద్దరి హీరోలను ఎప్పుడు వదులుతాడో.. అప్పుడే ఈ హీరోలిద్దరు తమ నెక్స్ట్ సినిమా విషయాలు బయటపెడతారు. కానీ రాజమౌళి ఈ ఇద్దరిని ఈ ఏడాది చివరి వరకు వదిలే సీన్ లేదని తెలుస్తుంది. మరి ఎన్టీఆర్, చరణ్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ కోసం మరో ఏడాది ఎదురు చూడాల్సిందే.