Advertisement
Google Ads BL

చిరు సినిమా నుంచి చెర్రీ ఔట్.. బన్నీ ఫిక్స్!


మెగాస్టార్ చిరంజీవి- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో సినిమా వస్తున్న విషయం విదితమే.  షూటింగ్ మాత్రం గ్రాండ్‌గా ప్రారంభమైనప్పటికీ రెగ్యులర్‌గా షూటింగ్‌ మాత్రం కాలేదు. కానీ.. సినిమాకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే.. చిరు పాత్రపై, సినిమా టైటిల్‌, హీరోయిన్ విషయమై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయ్. ఈ సినిమాలో చిత్రంలో రామ్ చరణ్ కూడా నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ప్లాష్ బ్యాక్‌లో అనగా.. చిరు చిన్నప్పుడు ఉండే పాత్రలో చెర్రీ కనిపించి అలరిస్తాడట. 

Advertisement
CJ Advs

నక్సలైట్‌గా చెర్రీ కనిపిస్తాడని.. తెరపై చరణ్ కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ పాత్ర మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని కూడా టాక్ నడిచింది. అంతేకాదండోయ్ సినిమా హైలెట్స్‌లో ఇది కూడా ఒకటంట. అయితే.. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమా అయిన ‘ఆర్ఆర్ఆర్’ లో చెర్రీ నటిస్తుండటం.. ఇంకా ఆయనకు సంబంధించిన సన్నివేశాలు షూటింగ్ పూర్తికాకపోవడం.. మరోవైపు సినిమా రిలీజ్‌ను కూడా వచ్చే ఏడాది జనవరికి జక్కన్న పోస్ట్ పోన్ చేయడంతో.. నాన్నగారి సినిమాలో చేయడానికి చెర్రీకి వీలు కావట్లేదట. వాస్తవానికి ఈ ‘ఆర్ఆర్ఆర్’ చేస్తూ మరో సినిమాలో చేయకూడదని ముందుగానే కండిషన్ పెట్టుకున్నారట. ఇందుకే చెర్రీ.. చిరు సినిమా నుంచి ఔట్ అయ్యాడట.

ఇక చెర్రీ స్థానంలో ఎవర్ని తీసుకోవాలని యోచించిన కొరటాల చివరికి స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అంతేకాదు.. చిరు సినిమాలో నటించడానికి బన్నీ కూడా ఉత్సాహం చూపిస్తున్నాడట. అంటే యంగ్ మెగాస్టార్‌గా బన్నీ తెరపై అలరించనున్నాడన్న మాట. చెర్రీ చాన్స్ బన్నీ కొట్టేశాడు సరే.. మరి మెగా ఫ్యాన్స్ ఆయన్ను అంగీకరిస్తారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ మధ్య బన్నీ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్‌గా పరిస్థితులు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యమే. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చినంతవరకూ వేచి చూడక తప్పదు మరి.

Cherry Out From Chiru Movie.. Bunny Fix!:

Cherry Out From Chiru Movie.. Bunny Fix!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs