Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ లిస్ట్‌లో మరో మాస్ డైరెక్టర్..!


ఎన్టీఆర్ కెరీర్ మొదలెట్టినప్పటి నుండి మాస్ చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాడు. సింహాద్రితో మాస్ హీరోగా ముద్ర పడిన ఎన్టీఆర్ ఎక్కువగా ఆ ఫార్మేట్ లోనే సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం మారడం లేదు. అరవింద సమేత లాంటి మాస్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిలిం RRR లో నటిస్తున్న ఎన్టీఆర్ తర్వాతి చిత్రాన్ని త్రివిక్రమ్ తో కన్ఫర్మ్ అన్నారు. త్రివిక్రమ్ కూడా ఓ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఎన్టీఆర్ కోసం సిద్ధం చేస్తున్నాడనే న్యూస్ ఉంది. త్రివిక్రమ్ కొత్తగా కామెడీ కథని ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నాడని అన్నారు.

Advertisement
CJ Advs

ఎలాగూ అల వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ తో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ కన్ఫర్మ్ అయ్యిందనే అన్నారు. లేటెస్ట్ గా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాపై ఓ ట్విస్ట్ బయటికి వచ్చింది. అదేమంటే త్రివిక్రమ్ అల తర్వాత ఖాళీ అవడం, ఎన్టీఆర్ ఏమో RRR తో జనవరి 8 వరకు బిజీగా ఉండడంతో త్రివిక్రమ్, ఎన్టీఆర్ కోసం అంత టైం వెయిట్ చెయ్యలేక మరో యంగ్ హీరోతో సినిమాకి కమిట్ అవ్వబోతున్నాడని, ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం ఫ్యామిలీ సినిమాల జోలికి వెళ్లడం ఎందుకు మరో మాస్ ఎంటర్టైనర్ చేస్తే బెటర్ అని, తమిళ దర్శకుడు అసురన్ ఫేమ్ వెట్రిమారన్ తో టచ్ లో ఉన్నట్లుగా  ఫిలింనగర్ టాక్. ఇప్పటికే వెట్రిమారన్ ఎన్టీఆర్ ని కలిసి మాస్ మసాలా కథని వినిపించినట్లుగా  వార్తలొస్తున్నాయి. మరి త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ఫిలిం అయితే ఇప్పట్లో కష్టమే అంటున్నారు.

One More Director in NTR Next Film list:

Jr NTR Mass Film with Vetrimaaran Direction
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs