విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో నిర్మాతకు భారీ నష్టాలూ తప్పేలా కనిపించడం లేదు. భారీ అంచనాలని చెప్పలేం కానీ విజయ్ దేవరకొండ క్రేజ్ తో వరల్డ్ ఫేమస్ లవర్ ఇరగదీస్తోంది అని నిర్మాత ఆ సినిమాకి బాగానే ఖర్చు పెట్టాడు. కానీ విజయ్ దేవరకొండ అసలు దర్శకుడుని పక్కనబెట్టి సినిమాలో తానే మొత్తం వేళ్ళు పెట్టి కెలికి సినిమాని చెత్త చెత్త చేసాడు. అసలే అర్జున్ రెడ్డి మైకం దిగలేదేమో సినిమాని అతలాకుతలం చేసాడు. అసలు అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ భగ్న ప్రేమికుడిగా నట విశ్వరూపం చూసాక మళ్ళీ అంతలాంటి నటననే యూత్ విజయ్ దేవరకొండ నుండి ఎక్సపెక్ట్ చేస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ యూత్ టార్గెట్ ని రీచ్ కాలేకపోతున్నాడు. వరసగా అర్జున్ రెడ్డి పోలికలతో సినిమాలు చేసి ఫూల్ అవుతున్నాడు.
తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ మొదటి రోజే దారుణమైన ఓపెనింగ్స్ అంటే 4.5 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంటే శనివారం ఇంకా కలెక్షన్స్ డల్ అయ్యాయి. ఇక ఆదివారమైతే సినిమా థియేటర్స్ లో జనాలే కనిపించలేదు. మరి అంత బోరింగ్ సినిమాకి వీకెండ్ లో బోరింగ్ కలెక్షన్స్ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్ వీకెండ్ లో 6.97 కోట్లు వస్తే, వరల్డ్ వైడ్ గా 8.50 కోట్లు వచ్చాయి. మరి నిర్మాత 25 కోట్లకి పైగానే పెట్టుబడి సినిమా తీయిస్తే ఇప్పుడు ఈ సినిమా 15 కోట్లకి పైగానే నష్టాలొచ్చేలా కనబడుతుంది వ్యవహారం. ఇక వరల్డ్ ఫేమస్ లవర్ ప్రొడ్యూసర్ ఈ సినిమా తియ్యడానికి ఇల్లు కూడా తాకట్టు పెట్టాడనే న్యూస్ నడుస్తుంది. ఇక వీకెండ్ లోనే ఈ సినిమా పరిస్థితి ఘోరంగా ఉంటే, ఇక సోమవారం వరల్డ్ ఫేమస్ లవర్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. కనీసం 20 నుండి 25 శాతం ప్రేక్షకులు కూడా థియేటర్స్ లో లేరు అంటే వరల్డ్ ఫేమస్ లవర్ నష్టాలుతో బయ్యర్లు గుండెలు గుభేలుమంటున్నాయి.