గ్యాంగ్ లీడర్ లాంటి యావరేజ్ మూవీ తర్వాత నాని చేస్తున్న సినిమా వి. నాని మొదటి సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. నాని మొదటిసారిగా నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తున్న చిత్రమిది. చిత్ర బృందం ప్రమోట్ చేస్తున్నట్టుగా నాని రాక్షసుడిగా కనిపిస్తుంటే, సుధీర్ బాబు రక్షకుడిగా కనిపించనున్నాడట. అదితి రావ్, నివేధా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నిన్న ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం సస్పెన్సు సన్నివేశాలతో, థ్రిల్లర్ లుక్స్ తో చాలా రిచ్ గా ఉంది. ఒక యాక్షన్ మూవీకి ఉండాల్సిన అన్ని లక్షణాలు టీజర్ లో కనిపించాయి, టీజర్ చివరిలో నాని పలికే ..సోదాపు... దమ్ముంటే నన్నాపు.. అనే డైలాగ్ జనాల్లోకి బాగా వెళ్ళింది. సినిమా విడుదలకి చాలా రోజులు సమయం ఉన్నా ప్రమోషన్ల విషయంలో చాలా ఉత్సాహం చూపిస్తుంది చిత్ర యూనిట్.
మొహనక్రిష్ణ నుండి వస్తున్న మొదటి యాక్షన్ చిత్రం కావడంతో అందరి కళ్ళు ఈ సినిమాపైనే ఉన్నాయి. అదీ గాక నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపించనుండడం కూడా అందరి ఆసక్తికి కారణమైంది. ఆ ఆసక్తిని మరింత పెంచేలా చిత్ర బృందం ప్రమోషన్లని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. టీజర్ రిలీజ్ అయ్యాక నాని ఈ సినిమాలోని స్మోక్ చేస్తున్న తన ఫోటోని పోస్ట్ చేస్తూ స్మోకింగ్ ప్రమాదకరమే...కానీ అంతకంటే ప్రమాదమైనవాడు వెనకాల ఉన్నాడు అని కామెంట్ పెట్టాడు..
దీన్ని బట్టి నాని ఈ సినిమాలో విలనిజం బాగా పండించాడని అర్థం అవుతోంది. ఇప్పటి దాకా పక్కింటి అబ్బాయిలాగా, అమాయక ప్రేమికుడిగా కనిపించినా నానిని విలన్ గా చూడడానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.