Advertisement
Google Ads BL

‘దేవినేని’ సినిమా.. ‘రంగా’ పాత్రకు డబ్బింగ్


‘దేవినేని’ సినిమా డబ్బింగ్‌‌లో సురేష్‌ కొండేటి

Advertisement
CJ Advs

వంగవీటి మోహనరంగా గొంతు ఎలా ఉంటుందో మనకు తెలియదుగానీ సురేష్‌ కొండేటి రంగా పాత్రకు డబ్బింగ్‌ చెబుతుంటే అక్కడున్న వారంతా అదరహో అన్నారట. నిజంగా రంగా గొంతు ఇలాగే ఉంటుందేమో అనికూడా అన్నారట. తారకరత్న, సురేష్‌ కొండేటి హీరోలుగా తెరెకెక్కుతున్న ‘దేవినేని’ చిత్రం డబ్బింగ్‌ దశలో ఉంది. రంగా పాత్రను పోషిస్తున్న సురేష్‌ కొండేటి సోమవారం ప్రసాద్‌ ల్యాబ్‌ డబ్బింగ్‌ ధియేటర్‌లో తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు. శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్‌.టి.ఆర్‌ ఫిలింస్‌ పతాకంపై రామూరాథోడ్‌, జి.ఎస్‌.ఆర్‌.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌, ఎడిటింగ్‌ కార్యక్రమాను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వారం రోజులుగా డబ్బింగ్‌ కార్యక్రమాల్లో ఉంది.  

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివనాగు మాట్లాడుతూ..  ఆనాటి మహాభారతం, రామాయణం కథల్లో ఏముందో మనందరికీ తెలుసు. విజయవాడలో దేవినేని నెహ్రూ, రంగాల మధ్య ఏం జరిగిందో కొంతే మనకు తెలుసు. వారిద్దరి మధ్యా ఎలాంటి సంఘర్షణ జరిగింది, అది ఘర్షణకు ఎలా దారితీసింది అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది.. అని వివరించారు. ఈ సినిమాకు సంబంధించి వరుసగా డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏప్రిల్‌ మొదటివారంలో సినిమా విడుదవుతుందని చెప్పారు. 

సురేష్‌ కొండేటి మాట్లాడుతూ.. రంగా పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం చాలా థ్రిల్‌ కలిగించిందని అన్నారు. కంటిన్యూగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రంగాతో తనకు అంతగా పరిచయం లేకపోయినా ఆయన ఎలా మాట్లాడి ఉంటారో ఊహించుకుని మాట్లాడానన్నారు. తొలిరోజు డబ్బింగ్‌ కు మంచి అప్లాజ్‌ రావడం ఆనందం కలిగించిందని చెప్పారు. 

నిర్మాతల్లో ఒకరైన రామూరాథోడ్‌ మాట్లాడుతూ.. మేము అనుకున్నదానికన్నా సినిమా బాగా వచ్చింది. ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరించామన్నారు. 

మరో నిర్మాత జి.ఎస్‌.ఆర్‌.చౌదరి మాట్లాడుతూ.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయని చెప్పారు. ఇందులో హీరోయిన్లుగా నవీనారెడ్డి, తేజా రెడ్డి నటిస్తున్నారు. రాజ్‌ కిరణ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Devineni Movie Latest Update:

Suresh Kondeti Dubbing to His Role in Devineni Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs