Advertisement
Google Ads BL

నితిన్ రూపంలో శర్వాకి మరో దెబ్బ!


రెండు మూడు సినిమాల ప్లాప్స్ తర్వాత జాను సినిమాతో శర్వానంద్ భారీ హిట్ కొట్టాడు. జాను సినిమాతో శర్వా పరిణీతి చెందిన నటుడిగా అదరగొట్టాడు. ఆ సినిమాలో రామచంద్రగా శర్వా నటనకు అందరూ ఫిదా అయ్యారు. కానీ సినిమాలో శర్వా, సమంత నటన, కథ, కథనం బావున్నప్పటికీ ఈ సినిమా ఓ రీమేక్ అవడంతో.. కలెక్షన్స్ రాలేదు. దానితో శర్వానంద్ బాగా ఫీలయ్యాడు. సూపర్ హిట్ సినిమాకి ప్లాప్ కలెక్షన్స్.. శర్వా ఉత్సాహం మీద నీళ్లు చల్లాయి. దానితో హిట్ వచ్చినా.. శర్వా ఆనందపడలేని పరిస్థితి.

Advertisement
CJ Advs

అయితే తాజాగా శర్వానంద్‌కి నితిన్ ఇండైరెక్ట్ గా దెబ్బయ్యబోతున్నాడు. అదేమిటంటే శర్వానంద్ జాను తర్వాత శ్రీకారం అనే వ్యవసాయ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకి నితిన్ భీష్మకి పోలికలున్నాయంటున్నారు. శ్రీకారం సినిమా మొత్తం ఆర్గానిక్ వ్యవసాయం మీదే నడుస్తుంది. ఓ చదువుకున్న కుర్రాడు... ఆర్గానిక్ పంటలు ఎలా పండించాడో శ్రీకారం కథ ప్రధానాంశం. కానీ భీష్మ సినిమా కమర్షియల్ అయినప్పటికీ.... ఈసినిమాలోను వ్యవసాయం ఆర్గానిక్ ఫార్మింగ్ నేపథ్యంలోనే కథ సాగుతుంది. మరి భీష్మ సినిమాలోనే ఆర్గానిక్ ఫార్మేట్ అంతో ఇంతో చూస్తే... ఇక శ్రీకారం సినిమాని అంత ఇంట్రెస్ట్ గా ఎవరు చూస్తారనే అనుమానం సోషల్ మీడియాలో రైజ్ అయ్యింది. అసలే జాను తో దెబ్బతిన్న శర్వా శ్రీకారంపై ఆశలు పెట్టుకున్నాడు. కానీ దానికి నితిన్ అడ్డం పడేలా ఉన్నాడు.

Bheeshma Effect on Sharwanand Sreekaram :

Similarities between Nithiin Bheeshma and Sharwanand Sreekaram Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs