Advertisement
Google Ads BL

ఈ హీరోయిన్ అందుకే గ్రేట్ అనేది


హీరోయిన్స్‌లో సాయి పల్లవి అంటే స్పెషల్. ఎందుకంటే క్రేజ్ ఉంది కదా అని.. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న కేరెక్టర్స్ ఒప్పుకుని తృప్తి పడదు. స్టార్ హీరో కాకపోయినా.. మీడియం రేంజ్ హీరో అయినా.. సాయి పల్లవి‌కి కేరెక్టర్ నచ్చడం, అలాగే లిప్ కిస్సులు, అందాల ఆరబోత లాంటివి లేకుంటేనే వెంటనే సినిమా ఒప్పుకుంటుంది. ఒకవేళ కిస్సింగ్ సీన్స్ ఉన్నప్పుడు పెద్ద హీరో అయినా సినిమా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా లవ్ స్టోరీ, విరాట పర్వం సినిమాలు చేస్తున్న సాయి పల్లవి స్క్రిప్ట్ డిమాండ్ చేసినా కూడా తను మాత్రం లిప్ కిస్సులకి, గ్లామర్ షో కి దూరమని మరోసారి చెప్పకనే చెబుతుంది.

Advertisement
CJ Advs

ఇక కొన్ని యాడ్ కంపెనీలు కోట్లు కుమ్మరిస్తామన్నా కూడా ఆమె యాడ్స్ లాంటివి చెయ్యనని మోహమాటం లేకుండా చెప్పేసింది. కొన్నాళ్ల క్రితం సాయి పల్లవి పడి పడి లేచే మనసు సినిమా చేసినప్పుడు ఆ సినిమా నిర్మాత సాయి పల్లవికి పారితోషికంలో 40 లక్షలు బాకీ ఉండటంతో సినిమా విడుదలైన తర్వాత ఇవ్వాలని చూశాడట. సినిమాకి కలెక్షన్స్ రాకపోవడంతో... ఆ నిర్మాత ఇస్తా అన్న 40 లక్షలు సాయి పల్లవి వద్దనేసిందట. తనకి డబ్బు కాదు.. ఆత్మసంతృప్తి ముఖ్యమని చెప్పడమే కాదు.. ఎక్కువ సంపాదిస్తే ఏమైనా ఎక్కువ తింటానా.. ఎంత సంపాదించినా రాత్రి ఇంటికి వెళ్లి నేను తినేది మూడు చపాతీలే.. అంతో తన ఉదారత చాటుకుంటుంది. అసలు సంతోషంగా, ఆత్మసంతృప్తితో బతికితే చాలు.. విలువలు చంపుకుని పని చేయడం అనేది నాకు నచ్చదని చెప్పి హీరోయిన్స్ అందరిలో అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది ఈ పల్లవి.

Sai Pallavi Greatness Revealed:

This is the Sai Pallavi Greatness
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs