Advertisement
Google Ads BL

రాజ‌మౌళి-చిరుకు క్లాష్ వచ్చిందా!?


మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో అందరికీ బాగా కావాల్సిన వ్యక్తి.. అందర్నీ గౌరవించే వ్యక్తి కూడా.. అలాంటిది గత కొన్ని రోజులుగా ఓటమెరుగని దర్శకుడు రాజమౌళికి ఆయనకు మధ్య క్లాష్ వచ్చిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అసలేం జరిగింది.. ? నిజంగానే క్లాష్ వచ్చిందా..? అని సినీ ఇండస్ట్రీలో.. ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇదంతా ఉత్తిత్తే అని అనుకోవడానికి కూడా పెద్దగా కారణాలు కూడా ఏమీ లేకపోవడంతో నిజమనేనని తెలుస్తోంది.

Advertisement
CJ Advs

వాస్తవానికి చెర్రీ సినిమా అంటూ మెగాస్టార్ జోక్యం తప్పని సరి అనే విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ‘చిరుత’ నుంచి చెర్రీ సినిమాలపై చిరు ప్రభావం కనిపిస్తూనే ఉంటుందన్న జగమెరిగిన సత్యం. ప్రస్తుతం చెర్రీ నటిస్తున్న ‘RRR’ విషయంలోనూ మెగాస్టార్ కలుగజేసుకున్నారట. వాస్తవానికి ఈ ఏడాది జూన్‌లోనే సినిమా రిలీజ్ చేయాలని మొదట రాజమౌళి అనుకున్నారు. అయితే సినిమాను ఇంకాస్త బాగా చూపించాలనుకొని వచ్చే ఏడావది జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు కూడా.

అయితే ఈసారి సంక్రాంతికి కొరటాల సినిమాతో తాను వద్దామని మెగాస్టార్ భావించారట. అయితే ఇంతలోపే రాజమౌళి అలా ప్రకటించడంతో చిరు ఒకింత నిరాశకు లోనయ్యారట. అంతేకాదు వీరిద్దరి మధ్య ఈ రిలీజ్ డేట్ విషయంలోనే చెడిందట. చెర్రీ సినిమాకు.. తన సినిమాకు కనీసం నాలుగు నెలలైనా గ్యాప్ ఉండాలి.. అలాంటిది ఒకేసారి అంటే కష్టం కదా..?. ఒక వేళ ఈ విషయం ముందు చెప్పి ఉంటే తాము జాగ్రత్త పడే అవకాశం ఉండేది కదా అని.. చెర్రీ చెవిన వేయగా.. ఆయన జక్కన్నకు చెప్పాడట. అందుకే తన ‘ఆచార్య’ (ఇంకా ఫిక్స్ కాలేదు) షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి జనవరికి ముందు లేదా వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ క్లాష్ వ్యవహారం ఎంతవరకు నిజమో..? ఏంటో క్లారిటీగా తెలియాల్సి ఉంది!.

Jakkanna Vs Chiranjeevi.. What Happen!?:

Jakkanna Vs Chiranjeevi.. What Happen!?  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs