Advertisement
Google Ads BL

యాంకర్ ఉదయ భాను కల నెరవేరింది!


ఉద‌య‌ భాను.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరును ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ముఖ్యంగా ఒకప్పుడు అనగా.. సుమ రాక మునుపు యాంకర్‌గా ఓ వెలుగు వెలిగింది. యాంకర్స్ అనసూయ, రష్మి ఇలాంటి వాళ్లెవరూ రాకమునుపే ఇండస్ట్రీని ఏలేసిందీ భాను. అయితే ఏ రేంజ్‌లో అలా పైకి లేచిందో.. ఇప్పుడేమో అడ్రస్ లేకుండా పోయింది. ముఖ్యంగా పెళ్లయ్యాక ఈ డ్యాన్సర్ కమ్ యాంకర్‌ అంతగా ఎక్కడా కనిపించలేదు. ఎప్పట్నుంచో అనుకుంటున్న ఈమె కల తాజాగా నెరవేరిందట. ఇంతకీ ఆమె కల ఏంటి..? ఎలా నెరవేరింది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

కల అంటే ఆమె ఏదో ఓ రేంజ్‌కు వెళ్లిపోయినకోకండోయ్.. ఓ కాస్ట్ లీ బెంజ్ కారును కొనుగోలు చేయాలని ఎప్పట్నుంచో ఒక డ్రీమ్ అట. అప్పట్నుంచి ఇప్పటి వరకూ నెరవేరకపోగా.. ఎట్టకేలకు తన కలను నిజం చేసుకుంది. బెంజ్ కారు కొన్న ఈ యాంకమ్మ.. షోరూమ్‌ సిబ్బంది డెలవరీకి ముందు తన భర్త, ట్విన్స్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హమ్మయ్యా తన కల ఎట్టకేలకు నెరవేరింది అన్నట్లుగా ఫోజులిచ్చిన ఈ ఫొటోలకు నెటిజన్లు, వీరాభిమానులు చిత్ర విచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

2004 ముందు వరకూ ఉదయ భానే నంబర్ వన్. ఆ తర్వాతే ఆమెకు షోలకు అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యాంకర్ కావాలనుకుంటోన్న చాలా మంది అమ్మాయిలకు ఉదయభాను స్ఫూర్తిగా నిలిచారని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యాంకరింగ్ అంటే ఫ్యాషన్‌తో పెళ్లి అయినప్పటికీ వదలకుండా కొనసాగుతోంది. సో కారు కొన్న తర్వాత అయినా ఈ యాంకరమ్మకు కలిసొచ్చి పాతరోజులొస్తాయేమో వేచి చూడాల్సిందే మరి.

Anchor Udaya Bhanu Desire true!:

Anchor Udaya Bhanu Desire true!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs