Advertisement
Google Ads BL

‘అహం బ్రహ్మాస్మి’లో హీరోయిన్‌గా టాప్ యాంకర్‌!

top anchor,manchu manoj,aham brahmasmi,priya bhavani shankar | ‘అహం బ్రహ్మాస్మి’లో హీరోయిన్‌గా టాప్ యాంకర్‌!

ఇదేంటి టైటిల్ చూడగానే మంచు మనోజ్ వచ్చేదే మూడేళ్ల గ్యాప్ తర్వాత.. మళ్లీ ఆ సినిమాలో హీరోయిన్‌గా టాప్ యాంకరా వర్కవుట్ అయ్యేనా..? అనే మెదులుతోంది కదూ..? మీరు వింటున్నది నిజమే కానీ.. ఆ టాప్ యాంకర్ మన తెలుగు పాప కాదండోయ్..? అటు టాప్ యాంకర్‌గా ఇటు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో చేస్తోందట. ఆమె అందచందాలు, నటన అద్భుతంగా ఉండటంతో ఎలాగే తన బ్యానర్‌లోనే వస్తోంది గనుక ఏ మాత్రం ఆలోచించకుండా మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇంతకీ హీరోయిన్‌గా ఆ యాంకర్ ఎవరు..? ఎక్కడ్నుంచి వస్తోంది..? ఆ కథేందో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

Advertisement
CJ Advs

కొత్త నటీమణులను పరిచయం చేయడంలో మంచు వారబ్బాయి తర్వాతే ఎవరైనా.. అలా పరిచయం అయిన కొందరు భామలు ఇప్పుడు టాప్ హీరోయిన్‌గా.. టాలీవుడ్‌ను ఏలుతున్నారు కూడా. ఇందుకు చక్కటి ఉదాహరణే మిల్క్ బ్యూటీ తమన్నా.. ‘శ్రీ’ సినిమాతో పరిచయమైన ఈ భామ ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. పైగా తన బ్యానర్‌లో కొత్తవారికి అవకాశాలిస్తానని.. ముఖ్యంగా యూత్‌ను ఎంకరేజ్ చేస్తానని ఇప్పటికే ఓ ప్రకటన కూడా ఇచ్చుకున్న మనోజ్.. ఇందులో భాగంగానే తమిళంలో టాప్ యాంకర్‌గా.. చిన్న చిన్న పాత్రలతో నటిగా మారిన ప్రియాభవాని శంకర్‌‌ను తన ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారట.

పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి నటీనటుల విషయాలు ఒకట్రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియా భవాని శంకర్‌ తన సినిమాకు అన్ని విధాలా సెట్ అవుతుందని భావించిన ఆయన ఓకే చెప్పేశారట. ఆమె తమిళ ఛానళ్లలో పలు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించడమే కాదు.. బుల్లితెరతో పాటు వెండితెరపైనా కొన్ని కొన్ని సినిమాల్లో కనిపించింది. ఇప్పటికే ఆ బ్యూటీకి స్క్రిప్ట్‌ కూడా వినిపించారని టాక్. ప్రస్తుతం ఆ యాంకర్.. విలక్షణ నటుడు కమల్‌- శంకర్‌ కాంబోలో వస్తున్న ‘భారతీయుడు 2’లో ఓ కీలక పాత్ర పోషిస్తుందని టాక్. అంటే టాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెడుతోందన్న మాట. తమిళం నుంచి హీరోయిన్లు, నటులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ప్రియా నటిస్తుందన్న వార్తలో నిజమెంతుందో..? ఒక వేళ అదే నిజమైతే ఏ మేరకు మంచు వారబ్బాయికి కలిసొస్తుందో వేచి చూడాల్సిందే.

Top Anchor In Manoj Aham brahmasmi Movie!:

Top Anchor In Manoj Aham brahmasmi Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs