Advertisement
Google Ads BL

చిరు రెకమెండేషన్‌ ఆ డైరెక్టర్‌తో అఖిల్!?


అన్నీ ఉన్నా ఐదోతనం తక్కువ ఉందన్నట్లుగా.. అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్‌కు మాత్రం అన్నీ ఎక్కువే అయినప్పటికీ సినిమాల పరంగా చూస్తే మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సినిమా లేదు.. హిట్ లేదూ..! అదే కుటుంబం నుంచి వచ్చిన నాగ చైతన్య మాత్రం దూసుకెళ్తున్నాడు.. విభిన్న కథనాలతో మంచి మంచి హిట్‌లతో ముందుకెళ్తున్నాడు. అంతేకాదు.. చైతూతో సినిమా అంటే డైరెక్టర్లు కూడా క్యూ కడుతున్నారు. అదే అఖిల్‌తో అంటే మాత్రం జంకుతున్నారట. ఎక్కడ తాము తెరకెక్కించిన చిత్రం ఫెయిల్ అయితే మళ్లీ మనకు ఆ చెడ్డపేరు ఎందుకులే అని భయపడుతున్నారట. 

Advertisement
CJ Advs

పాఫం ఎన్నిరోజుల నుంచో కుమారుడ్ని ఓ రేంజ్‌లో చూడాలన్న మన్మథుడు నాగార్జున ఆశలన్నీ అడియాసలే అవుతున్నాయ్. దీంతో ఏ హిట్ డైరెక్టర్‌ను రంగంలోకి దింపితే అఖిల్‌ హిట్టిస్తాడా..? వేయి కళ్లతో వేచి చూస్తున్నాడట. అయితే ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ అయినా కలిసొస్తుందనే నమ్మకం లేదట. అందుకే హిట్ డైరెక్టర్‌ అయిన సురేందర్ రెడ్డిని లైన్‌లో పెట్టాడట. మెగాస్టార్ చిరంజీవికి ‘సైరా’ లాంటి భారీ చిత్రాన్నిచ్చిన సురేందర్‌ను లైన్లో పెట్టడానికి నాగ్ విశ్వప్రయత్నాలు చేశాడట. ఒకానొక క్రమంలో ఆయన ఒప్పుకోకపోవడంతో మెగాస్టార్‌ను రెకమెండేషన్ చేయాలని రెక్వెస్ట్ కూడా చేశాడట నాగ్.

అలా నాగ్ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయట. ప్రస్తుతం ముగింపు దశలో అఖిల్ సినిమా తర్వాత తదుపరి సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ‘సైరా’ తర్వాత రెండు కథలు సురేందర్ దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే అవన్నీ అనుకున్నట్లు జరగపోయే సరికి.. చిరు మాటను కాదనలేక ఈ మధ్యే అఖిల్‌ను కూర్చోబెట్టి ఓ లైన్ చెప్పగా కుర్రాడికి, నాగ్‌కు తెగ నచ్చేసిందట. ఈ సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ కూడా రెడీగా ఉందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.

Chiru Recommendation.. Akhil Movie!:

Chiru Recommendation.. Akhil Movie!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs