Advertisement
Google Ads BL

ఇంటర్వ్యూ: మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర


ఇప్పుడున్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్రకు ఓ ప్రత్యేకత ఉంది. చాలా మంది ప్లే లిస్ట్స్ లో ఈయన సంగీతం అందించిన పాటలే ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. ‘నచ్చావులే’, ‘మనసారా’, ‘నువ్విలా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’, ‘118’ ఇలా ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. ఇటీవలే వచ్చిన ‘సవారి’ చిత్రంలో ‘నీ కన్నులు’, ‘ఉండిపోవా’ పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పటి వరకూ కేవలం మెలోడీ సాంగ్స్ మాత్రమే అందిస్తూ ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన శేఖర్ చంద్ర ఒక్కసారిగా మాస్ మ్యూజిక్ అందిస్తే ఎలా ఉంటుందో ‘నీ కన్నులు’ పాట నిరూపించింది.

Advertisement
CJ Advs

ఈయన సంగీతంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘వలయం’ ఫిబ్రవరి 21 న విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుండి ఇటీవల విడుదల చేసిన ‘నిన్ను చూసాకే’ అనే పాటకి కూడా మంచి స్పందన లభించింది. ఇక ఈ నేపథ్యంలో ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న శేఖర్ చంద్ర కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నాడు.

ఇప్పుడు ఎక్కడ చూసినా మీ పాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎలా ఫీలవుతున్నారు?

చాలా హ్యాపీగా ఫీలవుతున్నానండీ.  ‘నచ్చావులే’ సినిమా నుండి నన్ను ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ‘సవారి’ పాటల్ని ఇంత పెద్ద హిట్ చేసారు. ముఖ్యంగా ‘నీ కన్నులు’ పాటకి వచ్చిన రెస్పాన్స్ నేను అస్సలు మర్చిపోలేను. ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ సాదించింది. ఇక సాంగ్ తో టిక్ టాక్ లో కొన్ని లక్షల వీడియో చేసారు. ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ అన్నకి థాంక్స్ అలాగే లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్ గారికి కూడా పెద్ద థాంక్స్.

మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయ్యింది.?

14 ఇయర్స్ అయ్యిందండి. ఇప్పటివరకూ 32 నుండి 35 సినిమాల వరకూ చేశాను.

మీ కెరీర్ ఎలా నడుస్తుంది అనుకుంటున్నారు..!

చూస్తున్నారు కదండీ..  చాలా కూల్ గా వెళ్తుంది. నా పాటలన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. వాటికి ఎక్కువగా టిక్ టాక్ లు కూడా చేస్తూ  వైరల్ చేస్తున్నారు.

ఇప్పటి వరకూ మీ మెమొరబుల్ మూమెంట్  ఏంటి?

నేను ఇప్పటి వరకూ చేసిన పెద్ద సినిమా ‘118’. అందులో ఒకే ఒక్క పాట ఉంటుంది. చెప్పాలంటే అది పెద్ద చాలెంజ్. గుహన్ గారు డైరెక్టర్, కళ్యాణ్ రామ్ గారు హీరో. కాబట్టి ఆ సినిమాలో ఉన్న ఆ ఒక్క పాటకి న్యాయం చేయగలనా అని భయం వేసింది. అందులోనూ అది థ్రిల్లర్ సినిమా. కానీ ‘చందమామే’ అనే పాట చాలా పెద్ద హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ గారు నన్ను అభినందించారు. నా కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాట అన్నారు. అది నా మెమొరబుల్ మూమెంట్ .

పెద్ద హీరోల సినిమాలు చేయడం లేదు అని ఫీలవుతుంటారా?

కచ్చితంగా ఆ ఫీలింగ్ ఉంటుంది. అయితే నేను చేసేవి చిన్న సినిమాలు అయినప్పటికీ.. కొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు.  కాబట్టి ఫ్రెష్ మ్యూజిక్ ఇవ్వగలుగుతున్నాను. మంచి అప్లోజ్ వస్తుంది. పేరు తెచ్చిపెట్టడానికి పెద్ద సినిమానే అవసరం లేదు కదా..!

ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలు, లవ్ స్టోరీలే చేస్తున్నారు. వాటి వలన ఎక్కువగా ఏది ప్లస్ అవుతుందని భావిస్తారు?

లవ్ స్టోరీస్ వల్ల మంచి మెలోడీస్, ఇక థ్రిల్లర్స్ చేయడం వల్ల మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

సోషల్ మీడియా వంటి ప్లాట్ ఫామ్స్ కి దూరంగా ఉండడానికి కారణం..?

ఎందుకో ఇప్పటి వరకూ దాని గురించి ఆలోచించలేదు. రీసెంట్ గా రాహుల్ సిప్లిగంజ్ కూడా ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చెయ్యి అని చెప్పారు. ఇప్పటి నుండి వాటి గురించి ఆలోచిస్తాను.

మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ లో మీకు బాగా నచ్చిన పాటలు ఏవి?

‘సవారి’ మూవీలో ‘నీ కన్నులు’, ‘ఉండిపోవా’ అలాగే ‘118’ మూవీలో ‘చందమామే’, ‘కార్తికేయ’ లో ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’, ‘మేం వయసుకు వచ్చాం’ మూవీలో ‘వెళ్ళిపోకే’.. ఈ పాటలు ఇష్టం.

మిగిలిన భాషల్లో కూడా సినిమాలు చేస్తారా?

ప్రస్తుతానికి తెలుగులో సాధించాల్సింది చాలా ఉంది. దాని తర్వాత ఎప్పుడైనా చూద్దాం(నవ్వుతూ)

మీ నాన్నగారు ఓ సినిమాటోగ్రాఫర్, మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అన్నప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు?

షాకయ్యారు.. సినిమాటోగ్రఫీ అంటే పర్వాలేదు.. కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా అంటే చాలా రిస్క్ అని చెప్పారు. కానీ కొన్ని సినిమాలు చేసాక వాటికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆయనకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది.

మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఎవరు?

ఏ.ఆర్.రెహమాన్ గారు.. అలాగే కీరవాణి గారు..!

మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

‘వలయం’ చేశాను. ఈ 21న విడుదల కాబోతుంది. ఇక ‘హుషారు’ టీం వాళ్ళది.. ఓ మూవీ ఫైనల్ కావాల్సి ఉంది.

Music Director Sekhar Chandra Interview:

<span>Sekhar Chandra Latest Interview updates</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs