Advertisement
Google Ads BL

నానితో పోటీ..అవసరమా తరుణ్..


యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హిట్ రుచి చూసి చాలా రోజులు అయింది. మొదటి సినిమా ఉయ్యాలా జంపాలా తర్వాత సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన కుమారి  ౨౧ ఎఫ్ తర్వాత అతని కెరీర్లో ఒక్క హిట్ కూడా లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విజయం మాత్రం అతన్ని వరించడం లేదు. దిల్ రాజు పేరున్న పెద్ద నిర్మాతతో తీసిన సినిమాలు సైతం అతనికి విజయాన్ని అందించలేకపోయాయి. దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన లవర్, ఇద్దరి లోకం ఒకటే చిత్రాలు ఘోర పరాజయాన్ని చవి చూశాయి.

Advertisement
CJ Advs

 

మొన్నటికి మొన్న దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఇద్దరి లోకం ఒకటే సినిమా రిలీజైన విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ హీరోగా ఒక లైలా కోసం ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఒరేయ్ బుజ్జిగా.. మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు లేవు. వరుస పెట్టి ఫ్లాపు సినిమాలు తీస్తున్న రాజ్ తరుణ్ మార్కెట్ చాలాఅ వరకు దెబ్బతింది.

 

ఇలాంటి టైమ్ లో ఒరేయ్ బుజ్జిగా హిట్ అవడం చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు చిత్ర బృందం తీసుకుంటున్న నిర్ణయం వల్ల హిట్ కష్టమే అనిపిస్తుంది. అసలే బజ్ లేని ఈ సినిమా నాని హీరోగా తెరకెక్కిన వి చిత్రంతో పోటీ పడుతుండడం విశేషం. నాని వి చిత్రమ్ ఉగాది రోజున విడుదలకి సిద్ధం అవుతోంది. రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని కూడా అదే రోజు విడుదల చేయాలని భావిస్తున్నారట. ఒకవేళ అదే జరిగితే అసలెలాంటి బజ్ లేని ఒరేయ్ బుజ్జిగా వి సునామీలో కొట్టుకుపోవడం ఖాయంగా అనిపిస్తోంది.

competition with Nani is not workout for Raj Tharun:

Raj Tarun Movie Orey Bujjigaa releasing on Ugadi..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs