ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత చాలా సైలెంట్ అయిన దర్శకుడు క్రిష్ తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాతో రోజు మీడియాలో హైలెట్ అవుతూనే ఉన్నాడు. బాలీవుడ్ లో మణికర్ణిక సినిమా చేసి కంగనా రనౌత్ చేతిలో బాగా బుక్ అయిన క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ తోనూ బాగా సఫర్ అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ తో క్రిష్ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసి పవన్ తో కలిసి కొత్త సినిమా మొదలెట్టేసాడు. ఇదొక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో దొంగగా కనిపిస్తాడని టాక్ ఉంది. ఈ సినిమాకి నాలుగు భాషలకు కలిపి అందరికి ఎక్కేలా విరూపాక్ష అనే టైటిల్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న పవన్ - క్రిష్ చిత్రంలో క్రిష్ యుటర్న్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దర్శక నిర్మాతలు ఇప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. క్రిష్‌కు బాలీవుడ్‌లో కూడా గుర్తింపు ఉండటంతో అక్కడ కూడా విడుదల చేయాలనుకున్నారు. దానికితోడు ఈ సినిమా పీరియాడికల్ సినిమా కావడంతో కచ్చితంగా బాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావించడం దీనికోసం బడ్జెట్ కూడా 100 కోట్లకు పైగానే అవుతుందని లెక్కలు వేసుకున్నారు. అయితే తాజాగా సై రా, సాహో సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అయ్యి హిందీలో దెబ్బేయ్యడంతో క్రిష్ నిర్మాత ఆలోచనలో పడి హిందీలో సినిమా షూట్ చెయ్యకుండా జస్ట్ డబ్ చేసి సినిమాని విడుదల చేద్దామని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.