Advertisement
Google Ads BL

‘ఏమైపోయావే’ మోషన్ పోస్టర్ విడుదల


ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి రిలీజ్ చేసిన ‘ఏమైపోయావే’ మోషన్ పోస్టర్

Advertisement
CJ Advs

శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం  స్టూడియోస్ పతాకాలపై మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా నిర్మాత హరి కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏమైపోయావే’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను  ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - ‘‘ఏమైపోయావే’ టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఈ చిత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. మోషన్ పోస్టర్ చాలా బావుంది. ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధించి చిత్ర యూనిట్ కి  మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

నిర్మాత హరికుమార్ మాట్లాడుతూ - ‘‘మా బ్యానర్లో ‘ఏమైపోయావే’ చిత్రం ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. మేము అడిగిన వెంటనే మా చిత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా బాగా రావడానికి ఆర్టిస్ట్స్, టెక్నిషియన్స్ ఎంతగానో సహకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు.

రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి, శ్రీను కేసబోయిన, మిర్చి మాధవి, సునీత మనోహర్, నామాల మూర్తి, మీసం సురేష్, మళ్ళీ రావా బుజ్జి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శాంతి పుత్ర విజయ్, సినిమాటోగ్రఫీ: శివ రాధోడ్, సంగీతం: రామ్ చరణ్, పాటలు: తిరుపతి జానవ, పీఆర్వో: సాయి సతీష్, నిర్మాత: హరి కుమార్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మురళి.

Emai Poyave Movie Motion Poster Released:

Raj Kandukurai launches Emai Poyave Movie Motion Poster
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs