Advertisement
Google Ads BL

కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ టాకీ పూర్తి!


కల్యాణ్ దేవ్  హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు కూర్చిన ఐదు పాటల్లో రెండు పాటలను ఇప్పటికే చిత్రీకరించారు. వైజాగ్, హైదరాబాద్ లలో షూటింగ్ నిర్వహించారు.

నిర్మాతలు మాట్లాడుతూ... ‘‘సినిమాకు కన్నడ హీరోయిన్ రచితా రామ్ ప్లస్సవుతుంది. తొలి సినిమా ‘విజేత’తోనే నటనతో ఆకట్టుకున్న కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’లో మరింత చక్కటి పర్ఫార్మెన్సుతో అలరిస్తారు. అటు మాస్ ఆడియన్సుకీ, ఇటు ఫ్యామిలీ ఆడియన్సుకీ ఆయన క్యారెక్టర్ కనెక్టవుతుంది. తమన్ మ్యూజిక్ హైలెట్ అవుతుంది. ఇప్పటికి తీసిన రెండు పాటలూ చాలా అందంగా వచ్చాయి. ‘సూపర్ మచ్చి’ టైటిల్ సాంగ్ బ్రహ్మాండంగా వచ్చింది. ఆడియో బ్లాక్ బస్టర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కు ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుంది. రాజేంద్రప్రసాద్, నరేష్ అందించే కామెడీ అమితంగా అలరిస్తుంది. హీరోకి సపోర్టింగ్ గా నరేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మంచి వినోదాన్ని అందిస్తాయి. అలాగే రాజేంద్రప్రసాద్, హీరో కాంబినేషన్ సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. ఇది లవ్ స్టోరీ మిక్స్ చేసిన చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అని చెప్పారు.

వచ్చే నెలలో గోవాలో రెండు పాటలను చిత్రీకరించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

తారాగణం:

కల్యాణ్ దేవ్, రచితా రామ్, రాజేంద్రప్రసాద్, నరేష్, ప్రగతి, పోసాని కృష్ణమురళి, ‘జబర్దస్త్’ మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్

సాంకేతిక బృందం:

మ్యూజిక్: తమన్ ఎస్.

సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు

ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్

ఆర్ట్: బ్రహ్మ కడలి

పీఆర్వో: వంశీ-శేఖర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ కుమార్ మావిళ్ల

నిర్మాతలు: రిజ్వాన్, ఖుషి

దర్శకుడు: పులి వాసు

Kalyaan Dhev Super Machi Shooting Update:

Kalyaan Dhev Super Machi Talkie Part Completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs