Advertisement
Google Ads BL

నితిన్, శాలిని.. ప్రేమ వ్యవహారాలివే..!


ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకోవడం అనేది ఎవరికైనా కల నిజమవడం లాంటిదే. పెళ్లి ఖాయం చేసుకున్న రోజు నుంచీ లవర్‌తో గడిపే ప్రతి క్షణం మరపురానిదే. నితిన్ ఇప్పుడు అలాంటి క్షణాల్నే అనుభవిస్తున్నాడు. చాలా కాలంగా ప్రేమిస్తూ వస్తున్న శాలిని అనే యువతిని అతను పెళ్లాడబోతున్నాడు. దుబాయ్‌లో ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఆ ఇద్దరూ దండలు మార్చుకోనున్నారు.

Advertisement
CJ Advs

ఐదేళ్ల క్రితం నితిన్, శాలిని ప్రేమలో పడ్డారని సమాచారం. అప్పట్నుంచీ ఆమె లోకంగానే అతను ఉంటున్నాడని సన్నిహితులు చెప్తున్నారు. సినిమా స్టైల్లోనే ఆమెకు నితిన్ ప్రపోజ్ చేశాడంట. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం.. రెండింటినీ వేర్వేరుగా చూస్తూ వచ్చే నితిన్, ఇంట్లో ఎప్పుడూ సినిమాల గురించి చర్చించడు. కాగా ఈరోజు హైదరాబాద్‌లోని నితిన్ ఇంట్లో ప్రి-వెడ్డింగ్ ఫంక్షన్ జరుగుతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 15న సంప్రదాయబద్ధంగా నిశ్చితార్థం జరుపుకొని, ఏప్రిల్ 16న పెళ్లాడటానికి ఆ జంట సిద్ధమవుతున్నారు.

ఒక ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ.. ‘‘దుబాయ్‌లో పెళ్లి జరుగుతుంది. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ‘రంగ్ దే’ షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల పెళ్లి థీమ్ ను ఇంకా డిసైడ్ చెయ్యలేదు. అయితే అది స్పెషల్‌గా ఉంటుందని చెప్పగలను. పెళ్లయ్యాక, హైదరాబాద్‌లో నా ఫ్రెండ్స్ అందరితో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి రిసెప్షన్ ఉంటుంది’’ అని చెప్పాడు.

దాన్ని బట్టి నితిన్, శాలిని పెళ్లి కొద్దిమంది సన్నిహిత మిత్రులు, బంధువుల సమక్షంలో జరుగుతుందని అర్థమవుతోంది. తన లైఫ్‌లో గొప్ప రోజు శాలినికి ప్రపోజ్ చేసిన రోజేననీ, అప్పుడు శాలిని ఓకే చేసిందనీ అతను అంటున్నాడు. ప్రేమలో పడ్డ నాలుగేళ్ల తర్వాత వాళ్లు తమ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. మొదట ఆశ్చర్యపోయిన వాళ్లు, ఆ తర్వాత తమ అంగీకారం తెలిపారు. ఈ మార్చి 30వ తేదీకి నితిన్‌కు 37 ఏళ్లు నిండుతున్నాయి.

New About Nithiin and Shalini Love:

Nithin-Shalini Pasupu Kumkuma Program Performed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs