Advertisement
Google Ads BL

‘ఉప్పెన’.. హీరో, హీరోయిన్ లుక్ వదిలారు


‘ఉప్పెన’లో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఫస్ట్ లుక్ విడుదల

Advertisement
CJ Advs

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రి-లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. శుక్రవారం వేలంటైన్స్ డేని పురస్కరించుకొని చిత్ర బృందం హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో రంగురంగుల డ్రస్ లో మాస్ లుక్ తో వైష్ణవ్ తేజ్ ఆకట్టుకుంటుండగా, ఒక బస్సులోంచి తల బయటకు పెట్టిచూస్తూ క్యూట్ గా కనిపిస్తోంది కృతి శెట్టి. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఈ మూవీలో ఒక ప్రముఖ పాత్ర చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ప్రధాన తారాగణం:

పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ

సాంకేతిక వర్గం:

మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్

సినిమాటోగ్రఫీ: శాందత్ సైనుద్దీన్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్: మౌనిక రామకృష్ణ

పీఆర్వోలు: వంశీ-శేఖర్, మధు మడూరి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి.

సీఈఓ: చెర్రీ

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్

కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సానా

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్

Hero, Heroine Look out from Uppena :

Vaisshnav Tej and Krithi Shetty’s First Look In Uppena Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs