Advertisement
Google Ads BL

దర్శకనిర్మాతలను బెదరగొడుతున్న పవన్!


పవన్ కళ్యాణ్‌తో వ్యవహారం అంటే మాములు విషయం కాదని.. మొదటినుండి చూస్తూనే దర్శకనిర్మాతలకు తెలుసు. అయినా పవన్ కళ్యాణ్ లాంటి క్రేజీ హీరో తో పనిచేసి లాభాలు కొల్లగొట్టాలని నిర్మాతల ప్లాన్. అందుకే పవన్ ఏం చెప్పినా.. ఏం చేసిన భరిస్తున్నారు. తాజాగా దిల్ రాజు పవన్ కోసం నానా తంటాలు పడుతున్నాడు. ఇప్పుడు మరో నిర్మాత ఏ ఏం రత్నం కూడా పవన్ కళ్యాణ్ తో ఇబ్బందులు పడుతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. దిల్ రాజు అంటే తక్కువ బడ్జెట్ గనక ఏదో విషంగా పవన్ కళ్యాణ్ ని ఓ 40 రోజుల్లో వదిలించుకుంటాడు కానీ.. రత్నం సార్ అలా కాదు.. ఆయనతో క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఓ ఏడాది పట్టడం ఖాయం. ఈలోపు పవన్ కళ్యాణ్ వలన రత్నం గారి ఇబ్బందులు ఎన్ని బయటికొస్తాయో అంటున్నారు.

Advertisement
CJ Advs

ఎందుకంటే ప్రస్తుతం పింక్ రీమేక్ షూటింగ్ తో పాటుగా... క్రిష్ సినిమాని సమాంతరంగా చేస్తున్న పవన్ కళ్యాణ్ గంటల లెక్కన కాల్షీట్స్ ఇస్తూ నిర్మాతలను బెదరగొడుతున్నాడు. ఉన్న గంటని ఎలా వాడాలో తెలియక దర్శకనిర్మాతలు కంగారు పడుతుంటే.. ఉన్న గంటలోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ కి సరిగ్గా సహకరించకుండా వారిని ఇబ్బందులు పెడుతున్నాడట. చిన్న విషయానికి పెద్ద విషయానికి... కంప్లైంట్ చేస్తూ షూట్ చేయనని వెళ్లి పోతున్నాడట. మరి పవన్ అడిగినట్లుగా రోజుల లెక్కన పారితోషికం ఇస్తోన్న నిర్మాతలకి.. పవన్ ఇలా చేస్తుంటే కాలుతుంది. కానీ పవన్ విషయం తెలిసి నిర్మాతలు కామ్ అవుతున్నారని అంటున్నారు. పవన్ విషయంలో నిర్మాతలకి తల బొప్పికడుతున్నా సర్దుకుపోయేందుకే మొగ్గు చూపుతున్నారట.

Directors And Producers Tenssion Over Pawan Kalyan!:

Directors And Producers Tenssion Over Pawan Kalyan!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs