సినిమాలో పాటలు ఎంత ముఖ్యమో నేపథ్య సంగీతమూ అంతే ముఖ్యం. కొన్ని సినిమాలో పాటలు ఉండవు. అలాంటపుడు నేపథ్య సంగీతానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. దర్శకులు నేపథ్య సంగీతానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఎందుకంటే ఒక సీన్ ని దర్శకుడు ఎంత బాగా తీసినా అక్కడ సరైన నేపథ్య సంగీతం లేకపోతే ఆ సీన్ అంతలా పైకి లేవదు. కొన్ని సార్లు సీన్ లో అంత సరుకు లేకపోయినా నేపథ్య సంగీతం ప్లస్ గా మారి ఆ సీన్ కి ఎక్కడ లేని విశిష్టత వచ్చేస్తుంది.
సాధారణంగా సినిమా చేస్తున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లని తీసుకుంటారు. ఆ మ్యూజిక్ డైరెక్టరే సినిమాలో పాటలతో పాటు నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తాడు. కానీ గత కొంత కాలంగా తెలుగు సినిమాల్లో ట్రెండ్ మారుతూ వస్తుంది. సినిమాల్లోని పాటలు ఒకరి చేత చేయించి, నేపథ్య సంగీతాన్ని మరొకరితో చేయించుకుంటున్నారు. తెలుగులో ఈ తరహా వ్యవహారం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుండి మొదలయింది.
అయితే ఎక్కువ మంది దర్శకులు తమ సినిమాకి నేపథ్య సంగీతం కోసం థమన్ ని సంప్రదిస్తున్నారట. ప్రస్తుతం థమన్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అదీ గాక థమన్ నేపథ్య సంగీతం అందించడంలో బెస్ట్ అనిపించుకున్నాడు. థమన్ సంగీతం అందించిన చిత్రాలని గమనిస్తే ఈ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. అంతే కాదు ఒక సీన్ ని పైకి లేపడానికి థమన్ అందించే సంగీతం చాలా ఉపయోగపడుతుంది.
మొన్నటికి మొన్న మజిలీ సినిమాకి ఎలాంటి బ్యాగ్రౌంద్ స్కోర్ అందించాడో చూశాం. భాగమతి సినిమాకి థమన్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. కాబట్టి మేకర్స్ అందరూ నేపథ్య సంగీతం అనగానే థమన్ వైపు పరుగులు పెడుతున్నారట.