తెలుగులో ఆ మధ్య కాలంలో వచ్చిన రెండు సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అందులో ఒకటి అర్జున్ రెడ్డి కాగా మరోటి ఆర్ ఎక్స్ 100. అర్జున్ రెడ్డి సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకుపోతుంటే ఆర్ ఎక్స్ 100 లో నటించిన కార్తికేయకి మాత్రం అక్కడే స్టక్ అయిపోయాడు. ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయ చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఏ సినిమా కూడా విజయవంతం కాలేకపోయాయి.
ఇప్పటికీ కార్తికేయ అనగానే ఆర్ ఎక్స్ 100 సినిమానే గుర్తుకు వస్తుంది. వరుస వైఫల్యాలతో విసుగెత్తిన కార్తికేయ మరో కొత్త చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో కౌశిక్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో చావు కబురు చల్లగా అనే టైటిల్ తో మన ముందుకు వస్తున్నాడు. విభిన్నమైన చిత్రాలని నిర్మించే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా ఛాన్స్ దక్కడం అంటే చిన్న విషయం కాదు.
ఇప్పటి వరకూ వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న కార్తికేయ గీతాఆర్ట్స్ బ్యానర్ లో తీసే సినిమాతో గట్టెక్కుతాడని చూస్తున్నారు. చావు కబురు చల్లగా షూటింగ్ ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో కార్తికేయ శవాలను మోసే ఒక వ్యాన్ డ్రైవర్ బాలరాజు పాత్రలో ఊర మాస్ లుక్ తో కార్తికేయ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఫస్ట్ లుక్, సినిమా టైటిల్ తో పాటు కార్తికేయ కూడా కొత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఇన్ని పాజిటివ్స్ ఉన్న ఈ చిత్రమైన కార్తికేయకి విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.