Advertisement
Google Ads BL

అ సీక్వెల్ నాని చేయనని చెప్పాడా..?


ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో నాని నిర్మాతగా వ్యవహరిస్తూ కాజల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అ. వినూత్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. హీరో నాని ఈ సినిమాతోనే తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ ని స్టార్ట్ చేశాడు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఉత్తమ మేకప్ విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది.

Advertisement
CJ Advs

 

సినిమా విడుదలై  ప్రేక్షకుల నుండి మంచి మార్కులు తెచ్చుకున్నప్పటి నుండి ఈ సినిమా సీక్వెల్ ఉంటే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఆ విషయాన్ని హీరో నాని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి సోషల్ మీడియా ద్వారా అడుగుతూనే ఉన్నారు. అయితే ప్రశాంత్ వర్మ ఈ విషయమై స్పందించాడు. అ సినిమా సీక్వెల్ కోసం స్క్రిప్టు సిద్ధం చేశాడట. ఇప్పటికే పలువురు నిర్మాతలని కూడా సంప్రదించాడట. కానీ ఎవరూ సినిమాని ఓకే చేయలేదట. 

 

అ లాంటి వినూత్నమైన సినిమా ఓకే చేయాలంటే నిర్మాతకి మంచి టేస్ట్ ఉండటమే కాదు..ధైర్యం కూడా ఉండాలి. అయితే ఇప్పటి వరకు ప్రశాంత్ వర్మ అలాంటొ ధైర్యమున్న నిర్మాతని కలవలేదట.అయితే ఇక్కడే అందరికీ ఒక అనుమానం వచ్చింది. అ సినిమాని నాని నిర్మాతగా మారి మరి నిర్మించాడు. ఆ సినిమా ద్వారా జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడు.  అలాంటిది ఇప్పుడు సీక్వెల్ వద్దని చెప్పాడా అని అనుకుంటున్నారు. ఎందుకంటే నాని వద్దంటేనే ప్రశాంత్ వర్మ వేరే నిర్మాతల వద్దకి వెళ్ళి ఉంటాడని భావిస్తున్నారు. మరి నాని ఎందుకు వద్దన్నాడో..!

Is Nani doesn;t want to do sequel of AWE:

Prashanth varma searching for producers for AWE sequel
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs