ఇదేంటి టైటిల్ చూడగానే.. ఈ డైలాగ్ విన్నట్లుందే అనిపిస్తోంది కదూ.. కాస్త ఆలోచించి గుర్తుకుతెచ్చుకోండి.. ఓహ్ గుర్తొచ్చింది కదూ.. అదేనండి టాలీవుడ్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ అన్న మాటలివీ.. ఈ సరసన సంభాషణ దెబ్బకే ఆ పదవి కూడా ఊడిపోయిందిగా.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా. అప్పట్లో నెట్టింట్లో హల్ చల్ చేసిన ఆడియో ప్రకారం.. ‘వెనుక నుంచి వచ్చి పట్టుకుందామనుకున్నా. కెవ్వుమని అరుస్తావేమోనని భయపడి ఆగిపోయాను’ అని అన్నట్లుగా ఉండగా.. అటు మహిళ మాత్రం ‘ఎప్పుడు’ అని ఇలా ఆడియోను బట్టి చూస్తే చాలాచాలానే జరిగాయి. అయితే అప్పుడెప్పుడో జరిగిన వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చినట్లేనగా మీ సందేహం. అప్పుడు ఆ లేడీని వాటేసుకోవాలని పృథ్వీ అనుకున్నాడు.. అయితే ఇప్పుడు పృథ్వీని గట్టిగానే కమెడియన్స్ వాటేసుకుంటున్నారు. ఇంతకీ అసలు కథేంటో చూద్దాం.
తెలుగు కామెడీ షో అంటే మొదట గుర్తొచ్చేది ‘జబర్దస్త్’ అనే సంగతి తెలిసిందే. ఈ షోలో పంచ్‌లు మామూలుగా ఉండవ్ అంతే. కొన్ని స్కిట్‌లలో అయితే తాజాగా జరిగిన.. జరుగుతున్న పరిణామాలు కూడా ఉంటాయ్. మరీ ముఖ్యంగా సినిమాలో సన్నివేశాలను కూడా సేమ్ టూ సేమ్ కంటెస్టెంట్స్ దింపేస్తారు కూడా. అన్నీ చేసేశాంగా.. ఇక మిగిలిందల్లా పృథ్వీ వ్యవహారమే కదా.. అని ఆయన డైలాగ్‌ను కూడా వాడేశారు. జబర్దస్త్‌లో ఒకట్రెండు స్కిట్‌లలో ‘వెనుక నుంచి వచ్చి గట్టిగా వాటేసుకుందామనుకున్నా’ అంటూ కంటెస్టెంట్లు హడావుడి చేశారు. ఈ డైలాగ్ వినగానే ఓహ్.. ఆడియో టేప్ అందరికీ గుర్తొచ్చిందట.
అంతేకాదండోయ్.. ఒక్క జబర్దస్త్‌లోనే కాదు.. జీతెలుగులో వచ్చి ‘అదిరింది’ షోలో కూడా గట్టిగానే వాటేసుకున్నారు. అంటే ఈ దెబ్బతో డైలాగ్ ఎంత ఫేమస్ అయిపోయిందో చూడండి. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. వెనుక నుంచి గట్టిగా వాటేసుకుంటే పరిస్థితి ఇలా ఉంటుందా.. పృథ్వీగారు జరచూడండి పరిస్థితి ఎలా ఉందో కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఆడియోలో ఉండే వాయిస్ నిజంగా పృథ్వీదో కాదో అనేది దేవుడికే ఎరుకగానీ.. కంటెస్టెంట్లు మాత్రం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని గట్టిగానే వాటేసుకుంటున్నారు. కాగా.. ఆ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు పంపగా ఇంతవరకూ ఎలాంటి రియాక్షన్ లేదు. అయితే తాజా వ్యవహారంపై పృథ్వీ ఎలా రియాక్ట్ అవుతారో మరి.