Advertisement
Google Ads BL

చిరు-పవనా అయితే నాకేంటి.. అంటున్న బన్నీ!?


టైటిల్ చూడగానే కాస్త ఆశ్చర్యపోయారు కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.. ఇప్పటికే మెగా ట్యాగ్ తీసేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ సారి ఏకంగా చిరు.. పవన్‌కు ఎదురెళ్తున్నారా..?  అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయ్. అయితే ఇదంతా రియల్‌లో కాదండోయ్.. రీల్‌లో మాత్రమే..? ఇంతకీ బన్నీ కథేంటి..? బన్నీ ఎందుకిలా నిర్ణయం తీసుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. 

Advertisement
CJ Advs

‘నేనింతే.. ఎవరైతే నాకేంటి.. అస్సలు తగ్గేది లేదు.. తగ్గనంటే తగ్గను.. అసలెందుకు తగ్గాలి’ అని అనుకునే రకం బన్నీదని స్పష్టంగా తెలిసిందే. అయితే ఈ మధ్య ‘మెగా ఫ్యాన్స్’ అని పలకడం పక్కనెట్టేసిన ఆయన ‘నా ఫ్యాన్స్’ అనడం మొదలెట్టేశాడు. దీంతో మెగాభిమానుల్లో కొందరు.. మెగా హీరోలు కూడా బన్నీ చర్యలు విస్తుపోతున్నారట. అయితే ఇన్ని రోజులు ఇలా చేసిన అల్లూవారబ్బాయి.. ఈ సారి ఏకంగా మెగా బ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి.. పవర్‌స్టార్ పవన్‌‌‌ కల్యాణ్‌ను ఢీ కొట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’తో పరోక్షంగా ‘అల వైకుంఠపురుములో’తో ఆయన్ను ఢీ కొట్టిన బన్నీ.. త్వరలో అనగా రానున్న రోజుల్లో మెగా బ్రదర్స్‌ సినిమాలతో కూడా తలపడతాడన్న మాట.

ప్రస్తుతం బన్నీ-సుక్కు సినిమాలో నటిస్తున్న బన్నీ త్వరలోనే సినిమా షూటింగ్ ముగించుకుని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అది కూడా మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాలు రిలీజ్ ఉన్నప్పుడే.. ఈ సినిమా కూడా విడుదల చేయాలని చిత్రబృందాన్ని పట్టుబట్టాడట. ఇప్పటికే సూపర్‌స్టార్‌ను ఢీ కొట్టిన బన్నీ.. అస్సలు తగ్గేది లేదని చిరు-పవన్‌ను కూడా ఢీ కొట్టాలని చూస్తున్నాడట. అంటే ఇది బన్నీ వేస్తున్నది డేరింగ్ స్టేప్పే..! మరోవైపు కొరటాల శివ-చిరు, క్రిష్-పవన్‌ల కాంబోలో సినిమా రానుంది. ఈ సినిమాలకు సంబంధించి ఇప్పటికే బోలెడన్ని వార్తలు, పుకార్లు వచ్చాయి. అయితే మెగా బ్రదర్స్‌ను ఢీ కొట్టేందుకు బన్నీ ప్రయత్నాలు చేస్తున్నట్లు వచ్చే వార్తలు ఎంతవరకు నిజమనేది..? రిలీజ్‌కు ముందే వ్యవహారంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.

Bunny Daring Step..!!:

 Bunny Daring Step..!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs