Advertisement
Google Ads BL

పవన్ ఫొటోను మార్ఫింగ్ చేసి.. ఏంటిది!?


టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా షూరు అయిపోయింది. అంతేకాదు తర్వాతి సినిమాకు క్రిష్‌తో కూడా పవన్ కమిట్ అయ్యాడు. అందుకే గెటప్ మొత్తం మార్చేశాడు పవన్. మొన్నటి వరకు గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ ఉన్న పవన్.. ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు.. అయితే ఈ గెటప్ క్రిష్ మూవీ కోసం అని వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో హడావుడి జరుగుతోంది. పవన్ ఇదివరకే తన చేతికి టాటూ వేయించుకున్నాడని.. అందులో ‘సీఎం’ అని రాసి ఉందని నెట్టింట్లో పెద్ద ఎత్తున ఫొటోలు దర్శనమిస్తున్నాయ్.

Advertisement
CJ Advs

ఈ విషయం గత రెండ్రోజుల క్రితం పవన్.. పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యాడు. అక్కడే సరికొత్త లుక్ బయటపడింది. అంతేకాదండోయ్.. ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండటంతో వాటికి ఎవరో పనిగట్టుకుని మరీ.. చేయి ఎత్తున్నపవన్ ఫొటో మార్ఫింగ్ చేసి.. ‘సీఎం’ అని రాసిపెట్టి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అవునా ఇది నిజమేనా..? అని పవన్ వీరాభిమానులు, జనసేన కార్యకర్తలు సైతం ఒకింత ఆశ్చబోయారు. అంతేకాదు.. అబ్బే రెండు చోట్లు పోటీ చేసి ఒక్క చోట కూడా ఎమ్మెల్యేగా గెలవలేని పవన్.. సీఎం అని కామెంట్స్, సెటైర్స్ వేస్తున్నారు. తీరా చూస్తే ఇదంతా ఫేక్ అని అదెవరో మార్ఫింగ్ చేసిన ఫొటో అని కనుక్కున్న పవన్ ఫ్యాన్స్ , మెగా ఫ్యాన్స్.. ఆ మార్పింగ్ చేసిన వారిని రప్ఫాడేస్తున్నారు. పవన్‌కు ఎక్కడా టాటూ లేదన్న విషయం తెలిసిందే.

Pawan Kalyan Photo Morphing.. What Happens:

Pawan Kalyan Photo Morphing.. What Happens  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs