Advertisement
Google Ads BL

‘డిగ్రీ కాలేజ్’ కలెక్షన్స్ పెరుగుతున్నాయంట!


డిగ్రీ కాలేజ్ ను వ్యతిరేకించిన వాళ్లే సపోర్ట్ చేస్తున్నారు.  మౌత్ టాక్ తో కలెక్షన్స్ పెరుగుతున్నాయి 

Advertisement
CJ Advs

డిగ్రీ కాలేజ్ సినిమాను వ్యతిరేకించిన వాళ్ళే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారని దర్శకుడు నరసింహ నంది స్పష్టం చేసారు. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రమిది. వరుణ్, దివ్య రావు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సక్సెస్ మీట్ మంగళవారం హైద్రాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ... విడుదలకు ముందు  పోస్టర్స్ ను చూసి ఈ చిత్రాన్ని థియేటర్స్ లో ప్రదర్శించకుండా అడ్డుకుంటామన్న విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల నాయకులే చిత్రాన్ని చూసిన తర్వాత మనసుకు హత్తుకునే మంచి కంటెంట్ ఉందని ప్రశంసిస్తున్నారు. కేవలం కొన్ని రొమాన్స్ సీన్స్ చూసి సినిమా మొత్తంపై ఒకే రకమైన నెగటివ్ అభిప్రాయం ఏర్పరచుకోవద్దని మా మనవి. సినిమాను చూసిన తర్వాతే మాట్లాడమని మేము మొదట్నుంచి కోరుతున్నాం. సినిమాలో బలమైన కంటెంట్ వుంది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్యేగానికి గురిచేస్తున్నాయి. కుల వ్యవస్థ మీద తీసిన సినిమా ఇది. ఒకప్పడు నేను తీసిన “1940 లో ఒక గ్రామం కూడా కుల వ్యవస్థపైనే తీసాను. దానికి జాతీయ అవార్డు వచ్చింది కానీ డబ్బులు రాలేదు. అయితే ఈ సినిమాకు డబ్బులు కూడా రావడం ఆనందాన్ని కలిగిస్తోంది. మొదట రెండు, మూడు రోజులు కలెక్షన్స్ అంతగా రాకపోయినా.... సోమవారం నుంచి మౌత్ టాక్ తో కలెక్షన్స్ బాగా పెరిగాయి. విడుదలైన అన్న చోట్ల కలెక్షన్స్ పెరగడంతో సినిమా నిలబడుతుందన్న నమ్మకం కలిగింది. అని అన్నారు.   

హీరో వరుణ్, హీరోయిన్ దివ్య రావు మాట్లాడుతూ... ఈ సినిమాను ఆపేస్తామన్న వాళ్లే.... సినిమా బావుందంటూ సపోర్ట్ చేస్తున్నారు. సినిమాలో సందేశాత్మకమైన మంచి అంశమే ఇందుకు కారణం. చాలామంది ఫోన్స్ కూడా చేసి అభినందిస్తున్నారు అని చెప్పారు. 

నటుడు రవిరెడ్డి మాట్లాడుతూ... ఇందులో నటించడానికి బాగా అవకాశం వున్న నెగటివ్ షేడ్స్ పోలీస్ అధికారిగా... హీరోయిన్ తండ్రిగా నటించాను అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సహా నిర్మాత అలేటి శ్రీనివాసరావు, విలన్ పాత్రధారి మదన్ చిత్రానికి వస్తున్న స్పందనను తెలియజేస్తూ.. కొన్ని చోట్ల నుంచి చిత్ర బృందాన్ని సత్కరిస్తామంటూ ఫోన్స్ వస్తున్నాయి అని చెప్పారు. 

Degree College Movie Press Meet Details:

Degree College Movie Collections Hiked says Movie team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs