Advertisement
Google Ads BL

నెటిజన్ పై సీరియస్ అయిన రానా...


సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే సెలెబ్రిటీల్లో రానా కూడా ఒకరు. ఆయన తన మీద చేసే పాజిటివ్ కామెంట్లకైనా, నెగెటివ్ కామెంట్లకైనా చాలా చురుకుగా స్పందిస్తుంటాడు. అప్పుడప్పుడు నెటిజన్లకి గంటపాటు సమయాన్ని వెచ్చించి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ ఉంటాడు. అయితే తాజాగా రానా చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒకానొక ఇంటర్వూలో రానా తాను పదవ తరగతిలో ఫెయిలయ్యానని, అయినా కూడా అది తన కలని నెరవేర్చుకోవడానికి ఏమాత్రం అడ్డుకాలేదని చెప్పాడు.

Advertisement
CJ Advs

 

ఈ విషయం మీద స్పందించిన ఒక నెటిజన్.. మీకు పెద్ద స్టూడియో ఉండటం వల్లే మీ కలలకి ఎలాంటి అడ్డు రాలేదని రిప్లై ఇచ్చింది. వారసత్వం వల్లే రానా తన కలని నెరవేర్చుకున్నాడన్నట్లుగా ఆమె మాట్లాడింది. అయితే ఈ మాటలకి రానా ధీటైన సమాధానం ఇచ్చాడు. ఎవరో అనామకులు ఏదో మాట్లాడారని ఊరుకోకుండా తనదైన సమాధానాన్ని ఇచ్చాడు.

 

రానా ఆ మాటలకి స్పందిస్తూ.. దేశంలో ఎన్నో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా కథలని ప్రేక్షకులకి అందించడంలో విఫలమై మూసివేయబడ్డాయని.. కానీ మేము మాత్రం రోజు రోజుకూ అప్డేట్ అవుతూ మమ్మల్ని మేము డెవలప్ చేసుకుంటున్నామని..ఇదంతా కేవలం మా టాలెంత్ వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. 

 

మొత్తానికి రానా సరైన సమాధానమే ఇచ్చాడని మాట్లాడుకుంటున్నారు. వారసత్వం వల్ల అన్ని సాధ్యం కావనీ, కేవలం ఎంట్రీ వరకే అది ఉపయోగపడుతుందని..ఆ తర్వాత టాలెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టూడియో ఉన్న లాభం లేదని రానా సపోర్టర్లు వాదిస్తున్నారు.

Rana serious on Netizen...:

Rana comments about nepotism
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs