Advertisement
Google Ads BL

పవన్ - క్రిష్ మూవీ టైటిల్ ఇదేనా?


మునుపెన్నడూ లేని విధంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల ఊపు మాములుగా లేదు. ‘పింక్’ రీమేక్, క్రిష్ సినిమా, హరీష్ మూవీ ఇలా వరసగా పవన్ కళ్యాణ్ సినిమాలతో పిచ్చెక్కిస్తున్నాడు. ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ ఒక బలమైన సామాజిక ఇతివృత్తంతో నిర్మించబడుతుండగా.. దర్శకుడు క్రిష్ చిత్రం మాత్రం పీరియాడిక్ ఎంటర్టైనర్ కానుంది. పవన్ ‘పింక్’ రీమేక్ కన్నా ఎక్కువగా క్రిష్ కాంబోలో పవన్ కళ్యాణ్ చెయ్యబోయే సినిమాపై మాత్రం పిచ్చ క్రేజ్, అంచనాలు ఉన్నాయి. మొఘల్ రాజవంశం యొక్క నేపథ్యాన్ని కలిగి ఉన్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక దొంగ పాత్రను పోషిస్తున్నట్లుగా ప్రచారంలో ఉంది.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరును ‘వీరా’ అని లాక్ చేసి... సినిమా టైటిల్ ‘విరూపాక్ష’  అని పెడితే ఎలా ఉంటుంది అని దర్శకనిర్మాతలతో పాటుగా పవన్ కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ‘విరూపాక్ష’ టైటిల్ అయితే ఈ కథకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని.. అలాగే పవన్ కళ్యాణ్ సరసన కియారా అద్వానీ పేరు పరిశీలించినప్పటికీ ఆమె పవన్ సినిమాకి ‘నో’ చెప్పింది అని.. ఆ స్థానంలో బాలీవుడ్ భామ వాణి కపూర్ ని కానీ, లేదంటే కీర్తి సురేష్ ని కానీ ఫైనల్ చేసే పనిలో క్రిష్ ఉన్నాడని, ఇక టైటిల్ తో పాటుగా, హీరోయిన్ పేరు త్వరలోనే ప్రకటిస్తారని అంటున్నారు.

Is This Pawan Kalyan and Krish Movie Title?:

Gossips on Pawan Kalyan and Krish Movie Title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs