Advertisement
Google Ads BL

ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ చేతిలో రానా త్రిభాషా చిత్రం


రానా దగ్గుబాటి త్రిభాషా చిత్రాన్ని ‘హథీ మేరే సాథి’, ‘కాండన్‌’, ‘అరణ్య’గా విడుదల చేస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌

Advertisement
CJ Advs

దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌.. వైవిధ్యమైన కథా చిత్రాలకు అండగా నిలబడుతూ ఇండియన్‌ సినిమాను భవిష్యత్తులో అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది. మూడు భాషల్లో రూపొందిన సినిమా ‘హథీ మేరే సాథి’, ‘కాండన్’‌, ‘అరణ్య’ సినిమాల పోస్టర్స్‌ను సోమవారం ఈరోస్‌ సంస్థ విడుదల చేసింది. ఈ సందర్భంగా..

ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ చైర్మన్‌ సునీల్‌ లుల్లా మాట్లాడుతూ - “ఈ సినిమాకు మూడు టైటిల్స్‌తో మూడు భాషల్లో విడుదల చేస్తున్నాం. మా బ్యానర్‌కు  చాలా స్పెషల్‌ మూవీగా భావిస్తున్నాం. యూనిక్‌ స్టోరీ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది” అన్నారు. 

చిత్ర దర్శకుడు ప్రభు సాల్మన్ మాట్లాడుతూ... “హృదయానికి హత్తుకునేలా మావటివాడు, ఏనుగుకి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే ఎమోషనల్‌ డ్రామానే ఈ చిత్రం. మానవజాతి  కజిరంగ, అస్సోమ్‌ ప్రాంతాల్లోని ఏనుగుల అవాస ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను  రూపొందిస్తున్నారు. అడవిలోనే ఉంటూ తన జీవితాన్ని అడవి, అందులో జంతు సంరక్షణకు ఓ వ్యక్తి ఏం చేశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. రానా దగ్గుబాటి ఈ సినిమాలో ఆ  పాత్రను అద్భుతంగా పోషించారు. ఈ సినిమాను చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో తెరకెక్కించాం. ప్రేక్షకులను మెప్పించేలా మూడు భాషల్లో సినిమాను తెరకెక్కించాం” అన్నారు.  

జంతు ప్రేమికుడు, జాతీయ అవార్డ్‌ గ్రహీత ప్రభు సాల్మన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘లైఫ్‌ ఆఫ్‌ పై’, ‘థోర్‌’, ‘బై మోక్ష్‌ బక్షి’ వంటి చిత్రాలకు వి.ఎఫ్‌.ఎక్స్‌ అందించిన ప్రాణ స్టూడియో ఈ  సినిమాకు వి.ఎఫ్‌.ఎక్స్‌ చేస్తుంది. ‘త్రీ ఇడియట్స్’‌, ‘పీకే’, ‘పింక్‌’, ‘వజీర్‌’ చిత్రాలకు సంగీతాన్ని అందించిన శాంతను మోయిత్ర ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ విజేత  రసూల్‌ పూకుట్టి ఈ చిత్రానికి సౌండ్‌ డిజైనింగ్‌ చేస్తున్నారు.

Eros International Presents Rana Aranya:

Rana Aranya Movie First Look Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs