Advertisement
Google Ads BL

స్టార్ హీరోతో నేను సినిమానా.. నో..నో..!


స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కేఎస్ రవికుమార్‌కు ఈ మధ్య ఏమీ కలిసిరావట్లేదు. ఏ సినిమా తెరకెక్కించినా ‘కొంచెం ఇష్టం-కొంచెం కష్టం’లాగా తయారైంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరికీ దాదాపుగా సూపర్ హిట్లిచ్చిన ఈయన ఇప్పుడు మాత్రం అన్ని సినిమాలు ‘సూపర్’ అనే పేరు వస్తే చాలనుకుంటున్నాడు. బాగా గుర్తుంటే బాలయ్య-రవికుమార్ కాంబోలో వచ్చిన ‘జై సింహా’ సినిమా పర్వాదనిపించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ‘రూలర్’ అస్సలు పాలించలేకపోయింది.! అయితే అలా బాలయ్యకు ప్లాప్ కట్టబెట్టిన ఈ డైరెక్టర్ ఇప్పుడు తమిళ్‌లో స్టార్ హీరో అయిన అజిత్‌తో ఓ పవర్‌ఫుల్ సినిమా తెరకెక్కించబోతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Advertisement
CJ Advs

పుకారు ఇదీ..!

ఓ సినిమా చేద్దాం అని అజిత్‌ను అడిగాడని.. రెండ్రోజులు సమయం తీసుకుని ఆలోచించిన ఆయన చివరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అందుకు కారణం అప్పుడెప్పుడో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘విలన్’ మూవీనే కారణమట. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది అంతేకాదు.. అజిత్ రేంజ్‌ను కూడా అమాంతం పెంచింది. తనకు లైఫ్‌ ఇచ్చిన దర్శకుడ్ని కాదనలేకపోయిన అజిత్ ‘సరే సర్’ అని చెప్పాడట. వాస్తవానికి అజిత్‌తో తీసిన సినిమా పెద్ద హిట్టవ్వడంతో మళ్లీ ఆయనతోనే తీస్తే తాను లైన్‌లోకి అనగా మళ్లీ సత్తా చాటడానికి సెట్ అవుతుందేమోనని డైరెక్టర్ భావిస్తున్నాడని వార్తలు గుప్పుమన్నాయ్. 

>వాస్తవం ఇదీ!

అయితే ఇందులో నిజానిజాలెంత అని ఓ జాతీయ మీడియా రవికుమార్‌ను సంప్రదించగా.. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. ‘డియర్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్, మీడియా మిత్రులందరికీ తెలియజేయడం ఏమనగా.. నేను అజిత్‌తో సినిమా చేస్తున్నట్లు ఓ పుకారు షికారు చేస్తోంది. అదంతా అవాస్తవం.. పచ్చి అబద్ధం. నాకు అస్సలు ట్విట్టర్ అకౌంట్ లేదు. నా పేరుతో అకౌంట్ ఉండొచ్చేమో కానీ అది నాది కాదు.. ఫేక్ అకౌంట్. దయచేసి అలాంటి ఫేక్ అకౌంట్స్‌లో వచ్చే వార్తలను నమ్మొద్దు.. సపోర్ట్ చేయకండి’ అని ఫేస్‌బుక్ వేదికగా రవికుమార్ క్లారిటీ ఇచ్చుకున్నారు.

Star Hero Work With These Director..Details Here..!:

Star Hero Work With These Director..Details Here..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs