Advertisement
Google Ads BL

లవర్స్ డే రోజున వస్తున్న శివ 143


సినీ పోలీస్ మాల్ లో శివ 143 ప్రీ రిలీజ్ ఈవెంట్ !

Advertisement
CJ Advs

శివ 143 ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ పోలీస్ మాల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు రచయిత చిన్న కృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.కళ్యాణ్ మాట్లాడుతూ... శివ 143 ట్రైలర్ చూసాను, చాలా బాగుంది, ఒక సినిమా తీసి 2 వ సినిమా తీయాలి అంటే భయపడుతున్న ఈ రోజుల్లో 98 సినిమాలు తీశారు అంటే ఆసక్తికరంగా ఉంది. శివ 143 కచ్చితంగా హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా తీయటం డబ్బు నాది కాబట్టి నాకు నచ్చిన నటులు, దర్శకుడు, కధ, నా ఇష్టం. కానీ విడుదల చేయాలి అంటే డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్, ప్రేక్షకుల ఇష్టం. వారిని ఒప్పించాలి అదీ చాలా కష్టం. అదీ తెలియక కొత్త నిర్మాతలు నష్టం పోతున్నారు. ఆ లాజిక్ తెలిసే నేను సినిమా తీస్తున్నాను. ఎప్పుడైనా నేను తీసిన సినిమా ప్లాప్ అవ్వచ్చు కానీ నేను ప్లాప్ అవ్వను. శివ 143 దర్శకుడు బాగా కష్టపడి తీసాడు. అతని టీం కెమెరామెన్ సుధాకర్, ఎడిటర్ శివ, వై ప్రసాద్, మ్యూజిక్ మనోజ్, బాగా సపోర్ట్ చేశారు. హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశారు. మిగతా ఆర్టిస్ట్స్, టెక్నిషియన్స్ బాగా చేశారు. నాకు అన్ని ఏరియాస్ లోని నా సొంత డిస్ట్రిబ్యూటర్స్ వున్నారు. వాళ్ళ వల్లే నేను ఇంత ఈజీగా సినిమా విడుదల  చేయగలుగుచున్నాను అన్నారు.

ప్రముఖ రచయిత శ్రీ చిన్ని కృష్ణ మాట్లాడుతూ... రామ సత్యనారాయణ ఇన్ని సినిమాలు తీశారు అని విని ఆశ్చర్యపోయాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అన్నారు.

నటీనటులు:

సాగర్ శైలేష్, ఎఇషా ఆదరహ, హృతిక సింగ్, డి.ఎస్.రావ్, ప్రియ పాలువాయి, రామసత్యనారాయణ

సాంకేతిక నిపుణులు:

మ్యూజిక్: మనోజ్ కుమార్ చేవూరి

ఎడిటర్: శివ వై ప్రసాద్

కెమెరామెన్: సుధాకర్ అక్కినపల్లి

ట్రైలర్ కట్ & సిజీ: నరేన్

పీఆర్ఓ: మధు వి.ఆర్

నిర్మాత: రామసత్యనారాయణ

కథ, స్క్రీన్ ప్లే, స్టట్స్, డాన్స్, కొరియోగ్రఫి, డైరెక్షన్: శైలేష్ సాగర్

Siva 143 Movie Pre Release Event Highlights:

Siva 143 Movie Release on Lovers Day
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs