Advertisement
Google Ads BL

ఆకాష్ పూరి ‘రొమాంటిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్!


ప్రపంచవ్యాప్తంగా మే 29న గ్రాండ్ గా విడుదలవుతున్న ఆకాష్ పూరి ‘రొమాంటిక్’

Advertisement
CJ Advs

‘రొమాంటిక్’ మూవీతో తనయుడు ఆకాష్ పూరికి బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. సినిమా ప్రొడక్షన్ స్టార్టయిన దగ్గర్నుంచి మంచి ప్రచార వ్యూహాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ మూవీ విడుదల తేదీని సైతం తనదైన శైలిలో అనౌన్స్ చేశారు.

మే 29న ప్రపంచవ్యాప్తంగా ‘రొమాంటిక్’ను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ లో మంచి వినోదంతో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లకు ఈ సినిమా అలాంటి కాలక్షేపాన్ని ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది. హీరోయిన్ కేతికా శర్మతో హీరో ఆకాష్ లిప్ లాక్ చేస్తున్న రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్ర చేస్తున్న ఈ మూవీని అనిల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్నారు. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రెండు పాటలూ సంగీత ప్రియులను అలరిస్తూ చార్ట్ బస్టర్స్ గా పేరు తెచ్చుకున్నాయి. నరేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తారాగణం:

ఆకాష్ పూరి, కేతికా శర్మ, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునయన

సాంకేతిక బృందం:

కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: పూరి జగన్నాథ్

డైరెక్టర్: అనిల్ పాడూరి

నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్

సమర్పణ: లావణ్య

సంగీతం: సునీల్ కశ్యప్

సినిమాటోగ్రఫీ: నరేష్

ఎడిటింగ్: జునైద్ సిద్దిఖి

ఆర్ట్: జానీ షేక్

పాటలు: భాస్కరభట్ల

ఫైట్స్: రియల్ సతీష్

పీఆర్వో: వంశీ-శేఖర్

బ్యానర్స్: పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్

Romantic Movie Release Date Fixed:

Akash Puri Romantic Movie Release on MAY 29th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs