Advertisement
Google Ads BL

విజయ్ దేవరకొండ ఆమె మాటలని వింటాడా?


కె ఎస్ రామారావు నిర్మాతగా  క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "వరల్డ్ ఫేమస్ లవర్" ఫిబ్రవరి  14 న విడుదలకి సిద్ధం అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్ర ప్రీ  రిలీజ్ ఈవెంట్  ఘనంగా జరిగింది. సాధారణంగా ఇలాంటి ఈవెంట్లలో సినిమా గురించి మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలి అని ఉందని చెప్తూ ఉంటారు. కాని అందుకు భిన్నంగా విజయ్ దేవరకొండ ఇదే తన చివరి ప్రేమ కథా చిత్రమని తేల్చి చెప్పాడు.

Advertisement
CJ Advs

 

నిజానికి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ విషయం చెప్పాడు. కానీ అప్పుడు ఎవరూ దీన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. అందుకని సోషల్ మీడియాలో తప్పితే ఎక్కడా ఈ విషయంపై ఎవరూ ఎక్కువగా స్పందించలేదు. కానీ మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఇదే మాట చెప్పడం ఆశ్చర్యపరిచింది. అయితే విజయ్ అలా చెప్పాడానికి చాలా కారణాలు ఉన్నాయి. తనకి హిట్ వచ్చిన సినిమాలన్ని లవ్ స్టోరీ సినిమాలే. అందునా అర్జున్ రెడ్డి సినిమా ఎంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే..

 

అదీ గాక ఇప్పుడు రిలీజైన వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా ట్రైలర్ లో అర్జున్ రెడ్డి పోలికలున్నాయని ట్రోలింగ్స్ వచ్చాయి. దాంతో విసుగు చెంది ఇక చేయనని చెప్పి ఉంటాడు. అయితే ఈ విషయంలో వరల్డ్ ఫేమస్ లవర్ హీరోయిన్ అయిన రాశిఖన్నా స్పందిస్తూ.. విజయ్ కి అమ్మాయిల్లో ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉందని, వారు విజయ్ ని లవ్ స్టోరీస్ లో చూడాలని అనుకుంటారని, అందుకే ఇదే చివరి లవ్ స్టోరీ అని చెప్పకుండా.. కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ మళ్లీ లవ్ స్టోరీ చేయాలని సూచించింది.మరి ఈ అమ్మడి మాటలని విజయ్ వింటాడో లేదో !

will he listen her Words?:

Vijay said ..World famouls lover will be my last love story
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs