Advertisement
Google Ads BL

‘ఎఫ్-3’లో మహేశ్ బాబు.. డీల్ కుదిరింది!!


అవును మీరు వింటున్నది నిజమే.. డీల్ కుదిరింది.. తన డీల్‌కు చిత్రబృందం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించడానికి రెడీ అయిపోయాడట. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మంచి ఊపు మీదున్న అనీల్ రావిపూడి ‘ఎఫ్-2’ సీక్వెల్ సినిమా ‘ఎఫ్-3’ తెరకెక్కించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎఫ్-2లో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్‌లను పెట్టిన అనీల్.. 3లో ఇంకొకర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ మూడో వ్యక్తిగా ఎవర్ని తీసుకోవాలి..? అని ఆలోచించిన అనీల్, సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మొదట.. మాస్ మహారాజ్ రవితేజను అనుకున్నారట. అయితే ఆయన సినిమాల్లో బిజిబిజీగా ఉండటం.. పైగా ఈ మధ్య అన్నీ వరుస ప్లాప్‌లు పడటంతో వద్దనుకున్నారట.

Advertisement
CJ Advs

గ్రీన్ సిగ్నల్..!

మహేశ్‌ బాబుతో తనకున్న సాన్నిహిత్యంతో అనిల్ సంప్రదించగా ‘డైరెక్టర్ నువ్వేగా.. ఇక ఆలోచించేది ఏముంది అనీల్.. నేను రెడీ’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే రెమ్యునరేషన్ మాత్రం గట్టిగా ఇచ్చుకోవాలని డిమాండ్ చేశాడట. అంతేకాదు.. అవసరమైతే లాభాల్లో వాటాలు కూడా ఇవ్వాల్సి వస్తుందని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశాడట. మరోవైపు.. ‘F3’ నాన్ థియేట్రికల్ రైట్స్ పారితోషికంగా ఇవ్వాలనే ఒప్పందం కుదిరిందని కూడా టాక్ నడుస్తోంది. అయితే దర్శకనిర్మాతలు మాత్రం మారు మాట చెప్పకుండా.. ఆయన ఓకే చెప్పడమే పెద్ద గగనం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దర్శకనిర్మాతలతో మహేశ్ డీల్ ఓకే అయ్యిందన్న మాట. అంటే ఎఫ్‌-3లో వెంకీ, వరుణ్, మహేశ్ ముగ్గురూ దుమ్ములేపబోతున్నారన్న మాట.

40 ని.. 30 డేస్!

కాగా.. ఈ సినిమాలో మహేశ్ కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంటుందట. ఉన్నంత సేపు మహేశ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడట. అంటే.. ‘సరిలేరు’ కామెడీ ‘ఎఫ్-3’లో కంటిన్యూ అవుతుందన్న మాట. అయితే.. ఈ నలభై నిమిషాల షూటింగ్‌కు కేవలం 30 రోజులు మాత్రమే మహేశ్ డేట్స్ ఇచ్చాడట. అంటే ఒక షెడ్యూల్ మొత్తం మహేశ్‌కే అన్న మాట. ఇప్పటికే వెంకీ, మహేశ్ కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ నటించారు. ఈ కాంబోలో రెండోసారి కాగా.. వరుణ్‌తో మాత్రం ఫస్ట్ టైమ్. సో.. మొత్తమ్మీద ఈ వార్తలో నిజానిజాలెంత..? అసలు ఈ ముగ్గురున్న సినిమా ఏ మేరకు ఆడుతుంది..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

Deal Ok.. Mahesh Green Signal To Anil Ravipudi!!:

Deal Ok.. Mahesh Green Signal To Anil Ravipudi!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs