Advertisement
Google Ads BL

గంగవ్వ సార్.. గంగవ్వ అంతే..!


‘గంగవ్వ’ ఈ పేరు తెలంగాణ ప్రజలకు.. మరీ ముఖ్యంగా యూట్యూబ్ వినియోగదారులకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. ఎందుకంటే గూగుల్‌లో లేదా యూ ట్యూబ్‌లో ‘గంగవ్వ’ అని టైప్ చేస్తే అన్నీ సెలబ్రిటీలతో దిగిన ఫొటోలే వస్తాయ్.. కాదు కాదు సెలబ్రిటీలే ఈమెతో దిగిన ఫొటోలు దర్శనమిస్తాయ్. ఎక్కడో మారుమూల పల్లెటూరిలోని గంగవ్వ ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది. సెలబ్రిటీ మామూలు సెలబ్రిటీ కాదండోయ్.. సినిమాలు ప్రమోట్ చేసే స్థాయికి ఎదిగిపోయింది. పెద్ద స్టార్‌లు, డైరెక్టర్లే ఆమె దగ్గరికెళ్లడం.. ఆమె సాయం కోరుతున్నారంటే ‘గంగవ్వ’ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
CJ Advs

‘గంగవ్వా.. గంగవ్వా’

ఇక అసలు విషయానికొస్తే.. ఆదివారం సాయంత్రం విజయ్ దేవరకొండ హీరోగా నలుగురు భామలతో నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌కు గంగవ్వ కూడా విచ్చేసి సినీ ప్రియులను అలరించింది. గంగవ్వ స్టేజ్ మీద స్కిట్ చేసి అందర్నీ అలరించి క్లాప్స్ కొట్టించుకుంది. అవ్వ మాట్లాడుతున్నంత సేపు ఈవెంట్‌లో ఈలలు, కేకలు.. ‘గంగవ్వా.. గంగవ్వా’ అంటూ కుర్రాళ్లు హోరెత్తించారు. అయితే అదే ఊపు హీరోయిన్స్ మాట్లాడినప్పుడు కానీ.. విజయ్ దేవర్ కొండ మాట్లాడినప్పుడు కానీ కనిపించలేదు. అంటే అవ్వ రేంజ్‌ ఏంటో స్పష్టంగా అందరీకీ అర్థమైందన్న మాట.

గంగవ్వ అంతే..!

ఒక్క మాటలో చెప్పాలంటే ‘అల వైకుంఠపురములో..’ పూజా హెగ్దే గురించి బన్నీ ‘మేడమ్ సార్.. మేడమ్ అంతే’ అనే డైలాగ్ గుర్తొస్తోంది. ‘గంగవ్వ సార్.. గంగవ్వ అంతే..’. ఇన్ని రోజులుగా యూట్యూబ్‌లో స్కిట్‌లకే పరిమితం అయిన ఆమె.. ఈ మధ్య ఈవెంట్స్‌ కూడా వస్తోంది. అంతేకాదు.. కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు చిత్రబృందాన్ని కూడా తనదైన శైలిలో ఇంటర్వ్యూ కూడా చేస్తోంది. ఇదిగో టాలెంట్ అనేది ఎవడబ్బ సొత్తు కాదు.. బుర్రకు పనిపెట్టి గట్టిగా అనుకుంటే దునియాను దున్నేయచ్చన్నది గంగవ్వను చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి.

Gangavva Sir.. Gangavva Anthe..!!:

Gangavva Sir.. Gangavva Anthe..!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs