Advertisement
Google Ads BL

టాప్ హీరో సినిమాలో నిత్యాకు చాన్స్!?


నిత్యా మీనన్.. జూనియర్ సౌందర్యగా తెలుగు ప్రేక్షకుల్లో ముద్రవేసుకుంది. తెలుగులో నటించి మెప్పించి.. తన ఖాతాలో వేసుకున్న హిట్ చిత్రాలు తక్కువే అయినప్పటికి అభిమానులను మాత్రం గట్టిగానే సంపాదించుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో సినిమాలు చేసి చాలా రోజులే అయ్యింది కానీ.. కోలీవుడ్, బాలీవుడ్‌లో మాత్రం గట్టిగానే చేస్తోంది. ‘మిషన్ మంగళ్’ సినిమాలో గృహిణిగా, పిల్లలున్న తల్లిగా నటించింది. అప్పట్లో వామ్మో.. ఇలాంటి పాత్ర ఎలా ఒప్పుకుందిరా బాబోయ్ అని అనుకున్నప్పటికీ ఎంతైనా బాలీవుడ్ కదా అని అలా చేసేసింది.

Advertisement
CJ Advs

ఆ తర్వాత మళ్లీ ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. అయితే తాజాగా.. తమిళ్‌లో టాప్ హీరోల్లో ఒకరైన ధునుష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందట. ‘ధనుష్‌ 44’ చిత్రంలో నిత్యా మీనన్‌ నటిస్తోందని టాక్ నడుస్తోంది. అప్పట్లో ‘సన్‌ పిక్చర్స్‌’ సంస్థ ధనుష్‌తో ఓ చిత్రం చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించినప్పటికీ అది ప్రకటనకే పరిమితం అయ్యింది. అయితే తాజాగా ఆ సినిమా చేయాలని సదరు సంస్థ పట్టాలెక్కించాలని భావిస్తోందట. ఇందులో నిత్యా సరసన రొమాన్స్‌కు నిత్యాను అనుకున్నారట. ఇప్పటికే నిత్యాను అడగ్గా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో పాత్రధారులెవ్వరు..? సినిమా తెరకెక్కించేదెవరు..? అనే విషయాలు మాత్రం ఇంకా అధికారికంగా తెలియరాలేదు. మరి నిత్యను తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలో నిజమెంతుందో..!

Nitya Menon To Team Up With Top Hero Movie.. Details Here..!:

Nitya Menon To Team Up With Top Hero Movie.. Details Here..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs