Advertisement
Google Ads BL

ఏయ్ జగన్ అంటూ హీరోయిన్ అతి మాటలు!?


కొన్ని సందర్భాల్లో మనం ఏదో అనుకుంటే.. అవతలి వ్యక్తులకు ఇంకేదో అర్థమవుతుంది.. ఇద్దరూ ఒక్కటికా కనెక్ట్ అయితే సరే లేకుంటే ఏదేదో జరిగిపోతుంటుంది. ఇదిగో ఇప్పుడు అటు సినిమాల్లో రాణించలేకపోయి.. రాజకీయాల్లో ఏదో చేసేద్దామని వెళ్లి ఏమీ చేయలేకపోతున్న మాధవీ లత పరిస్థితి కూడా ఇప్పుడిలానే తయారయ్యింది. ప్రభుత్వాన్ని హెచ్చరించాలని ఏదో అనుకుని ఫేస్‌బుక్ వేదికగా ఏదో కామెంట్ చేయబోతే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. చివరికి వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానుల నోట నిత్యం నానుతూ లేని పోని తిట్లు తిట్టించుకుంటోంది. ఇంతకీ ఆ తిట్ల లెక్కేంటి..? ఆ రేంజ్ తిట్టేంతగా హీరోయిన్ ఏమన్నది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

ఇవీ అతి మాటలు..!

కర్నూల్ జిల్లా బండిమెట్టలో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో.. మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని.. ఆ నిందితుడ్ని కఠినంగా శిక్షించాలి లేదా ఉరిశిక్ష వేయాలని స్థానికులు, బాలిక తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే అందరూ అడిగినట్లుగా తాను ఒక్క మాట అనేసుంటే బాగుండేది కానీ.. ‘ఏమిరా ఇది అన్యాయం.. ఏయ్ జగన్ రెడ్డి!! కర్నూల్ కోర్టు తరువాత కట్టుకుందువు కానీ.. ముందు ఉన్న కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో దిశ చట్టం అమలు చేయించు. నువ్వు నీ పిచ్చి తుగ్లక్ గోల’ అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నోరు పారేసుకుని అతి మాటలు మాట్లాడింది.

ఆడేసుకుంటున్నారు!?

అయితే ఏయ్.. ఏమిరా ఇలాంటి పదాలు వాడటంతో వైసీపీ వీరాభిమానులకు.. వైసీపీ కార్యకర్తలకు చిర్రెత్తుకొచ్చింది. ‘నువ్వెంత.. నీ రేంజ్‌ ఎంత?’ చూసుకుని మాట్లాడు మేడమ్ అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. పాపులారిటీ కోసం ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడతావా..? ముఖ్యమంత్రిని పట్టుకుని ఏమిరా అంటావా? కనీసం ఇంకిత జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా..?.. పెద్దలను గౌరవించాలని మీ ఇంట్లో, బడిలో చెప్పలేదా మాధవీ.. బుర్రుండే మాట్లాడుతున్నావా..? అని జగన్ ఫ్యాన్స్ గట్టిగానే మాధవిని ఆడేసుకుంటున్నారు. ఈ వ్యవహారం వైసీపీ నేతల దృష్టికి వెళ్తే ఎంత పెద్ద రచ్చవుతుందో మరి.

Actress sensational Comments On YS Jagan Reddy!:

Actress sensational Comments On YS Jagan Reddy!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs