Advertisement
Google Ads BL

సుక్కుని బన్నీ టెంప్ట్ చేస్తున్నాడుగా!


ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో పోటా పోటీ ఢీ కొట్టాడు. అసలు అల్లు అర్జున్ స్టామినా మహేష్ ముందు సరిపోతుందా అనే అనుకున్నారు. అయినప్పటికీ అల్లు అర్జున్ ఎక్కడా తగ్గలేదు. మహేష్ ని సవాల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అల వైకుంఠపురములో కలెక్షన్స్ ముందు సరిలేరు కలెక్షన్స్ చిన్నబోయాయి. అల వైకుంఠపురములో బరిలో లేకపోతే సరిలేరు కలెక్షన్స్ కొల్లగొట్టేది. కానీ అల్లు అర్జున్ ముందు మహేష్ నిలవలేకపోయాడు. అలా మహేష్ తో సవాల్ చేసి మరీ గెలిచినా అల్లు అర్జున్ కి ఇప్పుడు కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది.

Advertisement
CJ Advs

అందుకే వచ్చే సంక్రాంతికి రాజమౌళి RRR ని ఢీ కొట్టాలనే కసితో సుకుమార్ తో కలిసి సినిమా మొదలెడుతున్నాడు. పాన్ ఇండియా ఫిలింగా బరిలోకి దిగుతున్న RRR ముందు కొమ్ములు తిరిగిన హీరోలే సినిమాలు దింపడానికి ఆలోచిస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఏం పర్లేదు మన సినిమా సంక్రాంతి బరిలో ఉండాలని సుకుమార్ కి చెబుతున్నాడట. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా అప్పుడు కూడా అల్లు అర్జున్ పట్టుబట్టి తన సినిమా సంక్రాంతి బరిలో ఉండేలా ప్లాన్ చేసి సక్సెస్ అయినట్లే ఇప్పుడు సుకుమార్ తో చెయ్యబోయే సినిమా విషయంలోనూ అల్లు అర్జున్ అదే కాన్ఫిడెంట్ ని మెయింటింగ్ చేస్తున్నాడని అంటున్నారు.

ఇక అల్లు అర్జున్.. సుక్కు సినిమా సెట్స్ మీదకి వెళ్లలేదు కానీ అల్లు అర్జున్ ఈ డిసెంబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, 2021 జనవరి 13 న AA20 ని విడుదల చేయాలని పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా ఉన్నప్పటికీ జనవరి 8 నే సినిమా వస్తుంది కాబట్టి.... ఆ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అలాగే తమ సినిమా జనవరి 13 న వచ్చేవరకు RRR కలెక్షన్స్ కొల్లగొట్టుకుంటుంది. తర్వాత హవా మనదే అంటూ సుక్కుని, బన్నీ టెంప్ట్ చేస్తున్నాడట.

Allu Arjun Beats Mahesh Babu at Box Office:

Allu Arjun Next Target RRR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs