Advertisement
Google Ads BL

సమంత ఉంటే హీరోలతో పనేంటి!


పెళ్లి తర్వాత సమంత సినిమాల ప్రభంజనం ఎలా ఉంది అంటే ఏ సినిమాలో సమంత ఉంటే ఆ సినిమా హిట్ అనేంతగా సమంత క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. రంగస్థలంలో రామ్ చరణ్ తో పోటీ పడి నటించిన సమంత పెళ్లి తర్వాత పద్దతిగా ప్రత్యేకమైన పాత్రలకే పరిమితమవుతుంది. సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలతో అదరగొడుతున్న ఈ భామ బయట మాత్రం హాట్ గర్ల్ గానే దర్శనమిస్తుంది. నెటిజెన్స్ ఎంతమంది ఎన్ని అన్నా పట్టించుకోని సమంత మాత్రం మరో రెండు మూడేళ్లే సినిమాలు చేస్తానేమో అని స్టేట్మెంట్ ఇచ్చింది. మరి తర్వాత సమంతని ఏ నిర్మాతగానో చూస్తామేమో మనం కూడా. అయితే సమంత పెళ్లి తర్వాత చేసిన సినిమాల్లో హీరోలను తొక్కేసి మరీ నట విశ్వరూపం చూపిస్తుంది.

Advertisement
CJ Advs

మజిలీ సినిమానే తీసుకోండి సమంత సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చేవరకు సినిమాపై ఓ ఫీల్ లో ఉన్న ప్రేక్షకుడు సమంత ఎంట్రీతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. చైతు ఎంతగా నటించిన సమంత ముందు తేలిపోయాడు. అంతలా శ్రావణి పాత్రలో సమంత ఇరగదీసింది. ఇక యుటర్న్ అంతే. రాహుల్ రవీంద్ర ప్రేక్షక పాత్రే. అలాగే ఓ బేబీ సినిమాలోనూ నాగశౌర్య కూడా డమ్మీనే. తాజాగా శర్వాతో కలిసి నటించిన జాను సినిమాలో శర్వా ఓ మెట్టు సమంతపైనే ఉన్నప్పటికీ ఎక్కువగా సమంతానే ఫోకస్ అయ్యింది. జాను టైటిల్ పాత్రలో సమంత ఇరగదీసింది. అలా అని శర్వా తక్కువేమి కాదు సమంతతో పోటీ పడి నటించాడు. కానీ అందరి కళ్ళు సమంత నటన, ఆమె లుక్స్ మీదే. జానులో సమంత ఓ అద్భుతం అంటున్నారు. మరి సమంత పెళ్లి తర్వాత చేసే పాత్రలతో హీరోలను ఓ తొక్కు తొక్కి వదిలిపెడుతుందన్నమాట. అందుకే సమంత ముందు మనమెంత అన్నట్టుగా ఉన్నారు యంగ్ హీరోలంతా.

Samantha in Full Swing After Marriage:

Samantha Dominates Heroies in Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs