Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు


అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సక్సెస్ కిక్‌లోనే ఉన్నాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం, అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ రావడంతో అల్లు అర్జున్ పిచ్చ ఖుషిగా వున్నాడు. అదే ఆనందంలో అల్లు అర్జున్ భార్య స్నేహ, పిల్లలు ఆయాన్, అర్హలతో పాటుగా తిరుమల తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసాడు. అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఎయిర్ పోర్ట్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఆ పిక్ లో అల్లు అర్జున్ వేసుకున్న టీ షర్ట్ కి ఓ ప్రత్యేకత ఉంది. అలాగే అల్లు అర్జున్ తల మీద పెట్టుకున్న క్యాప్ విషయంలోనూ ఇంకో ప్రత్యేకత ఉంది. అదేమిటంటే అల్లు అర్జున్ కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ అల వైకుంఠపురములో సినిమా విడుదలకు ముందు రౌడీ బ్రాండ్ టి షర్ట్స్ ని అల్లు అర్జున్ కి గిఫ్ట్ గా పంపగా.. వాటిని వేసుకుంటా అని అల్లు అర్జున్ చెప్పాడు.

Advertisement
CJ Advs

అయితే అప్పుడు విజయ్ ఇచ్చిన రౌడీ టీ షర్ట్స్ ని అల్లు అర్జున్ తిరుపతి నుండి వచ్చేటప్పుడు వేసుకున్నాడు. అలాగే అల్లు అర్జున్ తల మీద క్యాప్ కూడా అల్లు అర్జున్ నెక్స్ట్ చెయ్యబోయే సినిమా పేరు ఆ క్యాప్ మీద ఉంది. వేణు శ్రీరామ్ తో అల్లు అర్జున్ చెయ్యబోయే ఐకాన్ సినిమా పేరు అల్లు అర్జున్ క్యాప్ మీద ఉంది అంటే అల్లు అర్జున్ ఐకాన్ ఆగలేదనేగా దానర్ధం. మొన్నీ మధ్యన సుకుమార్ చేస్తున్న అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ తో చెయ్యాల్సిన సినిమా ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి. అందులోను వేణు శ్రీరామ్ ఇప్పుడు పవన్ తో పింక్ రీమేక్ చెయ్యడం అల్లు అర్జున్ ఐకాన్ మీద ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడంతో ఆ సినిమా ఉంటుందో లేదో అనుకుంటే.. ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రం ఐకాన్ క్యాప్ పెట్టుకుని తిరుగుతూ అందరికి ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు.

Allu Arjun Clarity about Icon Movie with His Hat:

Allu Arjun in Vijay Deverakonda Gited Dress
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs