Advertisement
Google Ads BL

‘ఆర్జీవీ’పై యుద్ధం మొదలైంది


జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో ‘ఆర్జీవీ’ చిత్ర ముహూర్తం  

Advertisement
CJ Advs

కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న ‘ఆర్జీవీ’ చిత్ర ముహూర్తం మరియు పూజా కార్యక్రమాలు ది 09-02-2020న హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో చిత్ర బృందం సమక్షంలో జరిగాయి, ఈ సందర్భంగా నిర్మాత బాల కుటుంబరావు పొన్నూరి మాట్లాడుతూ... ఒక విద్యావేత్తగా పాఠాలు చెప్పి మంచిని బోధించే వృత్తిలో ఉన్న తనకు జొన్నవిత్తుల గారు చెప్పిన కథ నచ్చి సామాజిక బాధ్యతగా మొదటిసారి ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నానని ఒక మంచి చిత్రం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

చిత్రానికి కధా, మాటలు, పాటలు, చిత్రానువాదం సమకూర్చిన దర్శకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో కొందరు వ్యక్తులు స్వేచ్ఛ పేరుతో యువతను తప్పుదోవ పట్టించే భావజాలాన్ని ఒక సిద్ధాంతంలా ఎక్కించడం వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని ఒక ఆసక్తికరమైన చిత్రంగా తెరకెక్కిస్తున్నానని, ఈ చిత్రం పిచ్చెక్కించే వినోదంతో పాటు అటువంటి వాళ్లకు పిచ్చి తగ్గించే ఔషధం అవుతుందని, ప్రధాన నటులు, మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో నిర్మాత తెలియజేస్తారని, చిత్రీకరణ కార్యక్రమం మార్చి మొదటి వారంలో ప్రారంభిస్తామని తెలియజేసారు.

Jonnavithula Announced Movie on RGV:

RGV Movie Details Soon says&nbsp;<span>Jonnavithula</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs