Advertisement
Google Ads BL

‘ఆహా’.. అల్లు అరవింద్ ఇంకోటి స్టార్ట్ చేశారు


తెలుగువారి భ‌విష్య‌త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గేమ్ చేంజ‌ర్ ‘ఆహా ఓటీటీ’ - విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Advertisement
CJ Advs

నేటి యువ‌త ఆలోచ‌న‌ల‌ను, అభిరుచికి త‌గిన విధంగా కొత్త కంటెంట్‌తో సినిమా రంగానికి ధీటుగా డిజిట‌ల్ రంగంలో అభివృద్ధి చెందుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర భాష‌ల‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌పామ్స్‌ను మాత్ర‌మే చూశాం. కానీ తొలిసారి 100 శాతం ప‌క్కా తెలుగు కంటెంట్‌ను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది ‘ఆహా ఓటీటీ’ ఫ్లాట్ ఫామ్‌. తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫ్యూచ‌ర్‌లోనే బిగ్గెస్ట్ గేమ్ చేజింగ్ అనౌన్స్‌మెంట్ ‘ఆహా ఓటీటీ’.  శ‌నివారం ఆహా ఓటీటీ ప్రివ్యూ ఫంక్ష‌న్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ..

న‌వదీప్ మాట్లాడుతూ - ‘‘సాధార‌ణంగా మ‌నుషుల మ‌ధ్య ఉండే సంబంధాలు ఈవాళ రోజుల్లో ఎలా ఉన్నాయి? అనే పాయింట్‌తో ఈ మ‌స్తీ వెబ్‌సిరీస్‌ను చేశాం. డైరెక్ట‌ర్ క్రిష్‌గారు దీనికి క‌థ‌ను అందించారు. అన్నీ క్యారెక్ట‌ర్స్ క‌ల్పితాలే. తెలుగు ప్రేక్ష‌కులు కొత్త కాన్సెప్ట్‌ల‌ను ఆద‌రించ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. గీతాఆర్ట్స్‌లో ఎలాంటి సినిమాలు వ‌స్తుంటాయో మ‌నం చూసే ఉంటాం. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలోనూ అలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌లు వ‌స్తాయి’’ అన్నారు.

జాగ‌ర్ల‌మూడి క్రిష్ మాట్లాడుతూ - ‘‘సంతోషం, దుఃఖం, గ‌ర్వం, సిగ్గుప‌డ‌టం, ప్రేమ‌, వాంచ‌, అతృత‌, ఇబ్బంది ప‌డ‌టం ఇలా ప్ర‌తిదీ ఓ ఎమోష‌న్‌. జీవితం అంటేనే ఎమోష‌న్‌. ప్ర‌తిరోజూ మ‌నం ఒక ఎమోష‌న్‌లో ట్రావెల్ చేస్తుంటాం. మ‌స్తీ సిరీస్ అనేది మ‌న జీవితం. ప్ర‌తి వాడి చేతిలో సెల్‌ఫోన్స్ వ‌చ్చేశాయి. ప‌ట్ట‌ణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన సిరీస్ ఇది. అనేక జీవితాల స‌మాహారం, స‌మూహమే ఈ మస్తీస్‌. నేను రాసిన వాటిలో ఇదొక బెస్ట్ రైటింగ్ అని చెప్పొచ్చు. నేను పీరియాడిక్ సినిమాలే చేస్తున్నానని అంద‌రూ అంటుంటారు. కానీ సినిమాల్లో క‌న‌ప‌డే క్రిష్ వేరు. లోప‌ల కూడా మ‌రో క్రిష్ ఉంటాడు. నా రైటింగ్‌లోని మ‌రో కోణ‌మే ఈ మ‌స్తీస్‌. ఈ అవ‌కాశం ఇచ్చిన అల్లు అర‌వింద్‌గారికి, రామ్‌గారికి, అజిత్ ఠాగూర్‌కి థాంక్స్‌. అల్లు అర‌వింద్‌గారు నాకు మెంట‌ర్. ఈ మ‌స్తీస్‌కు ఆయ‌న హెడ్ మాస్ట‌ర్‌లా వ్య‌వ‌హ‌రించారు. స్క్రిప్ట్ ముందు నుండి ఆయ‌న ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. ఈ స్క్రిప్ట్‌లో ఏదైనా క్రెడిట్ వ‌స్తే నాకు యాబై శాతం వ‌స్తే.. మిగిలిన యాబై శాతం అర‌వింద్‌గారికి ద‌క్కుతుంది. అజ‌య్ భుయాన్ అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ - ‘‘ఏడాది క్రితం ఓ మీడియం మ‌న సినిమాల‌ను తినేస్తుందేమో అనే భ‌యంతో ఆహా ఓటీటీ ప్ర‌యాణం మొద‌లైంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీన్ని ఓ శ‌త్రువుగా చూడటం క‌న్నా.. దానిలో మంచి త‌నాన్నో మ‌రేదైనా కానీ.. మ‌న అచ్చ తెలుగువారికి తెలుగు కంటెంట్‌ను చూపిస్తే బావుంటుంద‌ని అనుకున్నాను. ఓసారి మై హోమ్ రామేశ్వ‌ర్‌రావుగారితో, రామ్‌తో ఈ విష‌యం గురించి మాట్లాడితే.. వాళ్లు వెంట‌నే త‌మ మ‌ద్దుతుని ఇస్తూ పార్ట్‌న‌ర్స్‌గా మారారు. ఇందులో మ‌రికొంత మంది ఎగ్జ‌యిటింగ్ పార్ట్‌న‌ర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు అహా ప్రివ్యూ మాత్ర‌మే చేస్తున్నాం. ఉగాది రోజున ఇంకా పెద్ద లాంచ్ ఉంటుంది. ఇక ఆహాను పెట్ట‌బోతున్నాన‌ని మా అబ్బాయిల‌కు చెప్ప‌గానే నాన్న నువ్వు రేప‌టిని చూస్తున్నావని అన్నారు. టెక్నాల‌జీ బిజినెస్ గురించి మా కోల్‌క‌తా స్నేహితుల స‌పోర్ట్ తీసుకున్నాను. అలాగే ఓ అమెరిక‌న్ కంపెనీ కూడా స‌పోర్ట్ అందిస్తున్నారు. డిజిట‌ల్ రంగానిదే భ‌విష్య‌త్తు. సినిమా ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను ఎంత‌లా హ‌త్తుకుంటుందో.. డిజిట‌ల్ కూడా అంతేలా హ‌త్తుకుంటుంది. ఎవ‌రైనా ఈ మీడియంలోకి రావాల‌నుకుంటే సందేహించ‌వ‌ద్దు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జాగర్ల‌మూడి క్రిష్‌. నేను నా ఆలోచ‌న చెప్ప‌గానే త‌న‌కు తానుగా షో చేస్తాన‌ని ముందుకు వ‌చ్చాడు. అన్వేష్ ప్యూర్ తెలంగాణ సినిమాలో న‌టిస్తూ డైరెక్ట్ చేశాడు. అలాగే వైవా హ‌ర్ష‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ స‌పోర్ట్‌తో ఇప్పుడు నాలుగు షోస్‌ను స్టార్ట్ చేశాం. ఈ ఏడాదిలో 25 షోస్‌ను చూస్తారు. కొన్ని సినిమాలు కూడా ఇందులోకి వ‌స్తాయి. ఇది మాకు కొత్త‌. ఏదీ క‌రెక్టో తెలియ‌దు. కాబ‌ట్టి అంద‌రూ స‌హ‌కారాన్ని అందించాల‌ని కోరుకుంటున్నాను. అజ‌య్ ఠాకూర్ దీన్ని అంత‌టినీ హ్యాండిల్ చేశాడు. ఇందులో కంటెంట్ బోల్డ్‌గా ఉంటుంది. మ‌నం ఎలా వ్య‌వ‌హరిస్తామో? ఎలా మాట్లాడుతామో? ఈ మీడియాలో చూపిస్తున్నాం. కాబ‌ట్టి పేరంట్ కంట్రోలింగ్ సిస్ట‌మ్ ఉండేలా చూసుకోండి’’ అన్నారు.

రాము రావు జూప‌ల్లి మాట్లాడుతూ - ‘‘మేం గృహ నిర్మాణ రంగం నుండి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగు పెట్టాం. అందులో భాగంగా డిజిట‌ల్ మీడియంలోకి అడుగు పెట్టాం. డిజిట‌ల్ రంగ‌మే భ‌విష్య‌త్‌. ఆహా ఓటీటీ .. అర‌వింద్‌గారి ఆలోచ‌న‌ల నుండి పుట్టింది. ఆయ‌న గ‌త ఎనిమిది నెల‌లుగా అజిత్ స‌హాకారంతో చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు. ఇందులో 100 శాతం తెలుగు కంటెంట్ ఉంటుంది. ఇది అంద‌రికీ అందుబాటులో ఉండాల‌ని ఏడాది ప్రీమియం 365 రూపాయ‌లుగా నిర్ణ‌యించాం. ఇందులో భాగ‌మైన అంద‌రికీ థ్యాంక్స్‌’’ అన్నారు.  

క్రేజీ స్టార్ విజ‌య్ దేర‌వ‌కొండ మాట్లాడుతూ - ‘‘ఆహా ఓటీటీ’ ఫ్యూచ‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గేమ్ చేంజ‌ర్ అని చెప్పొచ్చు. ఇప్పుడే ఒక ల‌క్ష యాప్స్ డౌన్ లోడ్ అయ్యాయి. ఈ ఓటీటీ టీవీని రీప్లేస్ చేస్తుంది. మీ న్యూస్‌, కామెడీ షోస్‌, సినిమాలు ఇలా అన్నీ ఒక్క బ‌ట‌న్‌తో మీ చేతికి వ‌చ్చేస్తాయి. మ‌న లైఫ్ స్టైల్లో మ‌నం ఎప్పుడూ ఫ్రీగా ఉంటే అప్పుడు మ‌న‌కు కావాల్సిన షోస్ చూసుకునే అవ‌కాశం దొరుకుతుంది. ఒక‌ప్పుడు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో మ‌న‌కు ప‌ద‌కొండు ఆట‌గాళ్లు మాత్ర‌మే తెలుసు. కానీ ఐపీఎల్ వ‌చ్చాక వంద‌ల మంది బ‌య‌ట‌కు వ‌చ్చారు. అలాగే ఆహా వ‌చ్చిన త‌ర్వాత కొత్త టాలెంట్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. వెబ్ నుండి సినిమాకు టాలెంట్ క్రాస్ ఓవ‌ర్ అవుతుంది. అలాగే సినిమాల నుండి వెబ్‌కి యాక్ట‌ర్స్ క్రాస్ ఓవ‌ర్ అవుతారు. చాలా వ‌ర్క్ క్రియేట్ అవుతుంది. ఇదే భ‌విష్య‌త్‌. గొప్ప‌గా ఉంటుంది’’ అన్నారు.

AHA Mobile App Launch Event Highlights:

Celebrities speech at AHA Mobile App Launch Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs