Advertisement
Google Ads BL

పవన్‌ ఫ్యాన్స్‌కు దిల్ రాజు శుభవార్త.. హ్యాపీ!


టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాలో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో ఆయన బిజిబిజీగా ఉన్నారు. పవన్ షూటింగ్‌లో ఉండగా ఓ పిక్ కూడా నెట్టింట్లో హల్ చల్ చేసింది. అయితే అదే దాదాపు ఫస్ట్ లుక్ అని ఫ్యాన్స్ అనుకున్నారు.. పెద్ద ఎత్తున షేర్‌ల వర్షం కురిపించారు. అయితే అది లీక్ అయిన ఫొటో అని ఆ తర్వాత తెలిసింది. అయితే అధికారికంగా మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. దీంతో మెగాభిమానులు కాస్త అసంతృప్తితో ఉన్నారు. 

Advertisement
CJ Advs

అయితే.. సినిమాకు సంబంధించి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్న వీరాభిమానులకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధిలో.. సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు తియ్యటి శుభవార్త చెప్పారు. అసలు సినిమా పరిస్థితి ఎలా ఉంది..? రిలీజ్ ఎప్పుడు..? ఫస్ట్ లుక్ ఎప్పుడు..? అనే విషయాలపై నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. ‘ పింక్ రీమేక్ షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. మార్చిలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. మేలో సినిమాను విడుదల చేస్తాం’ అని దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. కాగా.. ‘మే’ నెల దిల్‌రాజుకు సెంటిమెంట్ అన్న విషయం తెలిసిందే. దిల్ రాజు అప్డేట్ ఇవ్వడంతో మెగాభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

కాగా.. యంగ్ హీరో శర్వానంద్, సమంత నటీనటులుగా సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన రీమేక్ చిత్రం ‘జాను’ ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో సామ్, శర్వా నటనకు యూత్ ఫిదా అయిపోయింది. మరోవైపు కలెక్షన్ల పరంగాను ‘జాను’ దూసుకెళ్తోంది. సినిమా సూపర్ హిట్టయిన సందర్భంగా.. ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు, శర్వా, సామ్‌తో పాటు పలువురు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజ్‌.. పవన్ సినిమాపై అధికారిక ప్రకటన చేశారు.

Producer Dil Raju Good News To Pawan Fans.. Details Here..:

Producer Dil Raju Good News To Pawan Fans.. Details Here..  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs