Advertisement
Google Ads BL

జానుగా.. సమంత ది బెస్ట్ అంతే!


పెళ్లి తర్వాత సమంత రేంజ్ మారిపోతుంది. ఆమెకి అవకాశాలే రావు అనుకున్నవారికి సమంత ఎప్పటికప్పుడు హిట్ సినిమాలు చేస్తూ సమాధానం చెబుతూనే ఉంది. పెళ్లి తర్వాత గ్లామర్ డాల్‌గా మారిన సమంత సినిమాల్లో మాత్రం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకి మొగ్గు చూపుతుంది అనేది ఆమె చేసిన వరస సినిమాలు చూస్తే తెలుస్తుంది. మజిలీ, ఓ బేబీ, యు టర్న్, తాజాగా విడుదలయిన జాను సినిమాలు ఉదాహరణలు. ‘యుటర్న్‌’లో అందంగా గ్లామర్‌గా అదరగొట్టిన సమంత, మజిలీ సినిమాలో చైతూకి వైఫ్‌గా బలమున్న కేరెక్టర్‌లో ఎమోషనల్‌గా సూపర్ అనిపించింది. ఇక ఓ బేబీలో సమంత నటనకు అందరూ షాకవ్వాల్సిందే. అంత అద్భుతంగా నటించింది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా 96 రీమేక్ జాను సినిమాలో టైటిల్ రోల్ పోషించిన సమంత జాను అలియాస్ జానకి దేవి పాత్రకి ప్రాణం పోసింది. సమంతకి ఇది చాలా కష్టతరమైన పాత్ర అయినప్పటికి ఆమె మరోసారి తానేంటో నిరూపించుకుంది. ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ కన్నీరు పెట్టిస్తుంది. లుక్స్, పెర్ఫామెన్స్ విషయంలో త్రిషతో పోలిస్తే సమంత తక్కువగా కనిపిస్తుంది కానీ.. తెలుగులో ఈ పాత్ర చేయడానికి సమంత కంటే మంచి ఛాయిస్ లేదన్న ఫీలింగ్ కలిగించేలా ఆమె నటించింది. మరి ఇలాంటి పాత్రలకు సమంతనే బెస్ట్ ఛాయస్‌గా కన్పిస్తుంది. దిల్ రాజు మొదటి నుండి సమంతనే ఈ పాత్రకి ఎందుకు అనుకున్నాడో ఆయన ఛాయస్ ఎంత బెస్టో అనేది సమంత జాను కేరెక్టర్ నిజం చేసి చూపించింది.

Samantha The Best for Jaanu Role:

Samantha Role Highlight in Jaanu Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs